For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇన్ఫోసిస్ ఇన్వెస్టర్లకు 2019లో 36 శాతం లాభాలు

|

బెంగళూరు: గ్లోబల్ సాఫ్టువేర్ సర్వీసెస్ దిగ్గజం ఇన్ఫోసిస్ తమ ఇన్వెస్టర్లకు 2019 ఆర్థిక సంవత్సరంలో 36 శాతం లాభాన్ని ఇచ్చింది. ఈ విషయాన్ని కంపెనీ వెల్లడించింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను షేర్ హోల్డర్లకు మంచి లాభాలు ఇచ్చినట్లు తెలిపింది. కంపెనీ 38వ యాన్యువల్ జనరల్ మీటింగ్ (AGM) శనివారం నిర్వహించారు. 2019 ఏడాదికి గాను షేర్ హోల్డర్స్ రిటర్న్స్ 36 శాతం ఇచ్చామని ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నందన్ నీలేకని చెప్పారు.

5 రూపాయల ముఖ విలువ కలిగిన షేర్ పైన రూ.21.50 శాతం (430 శాతం) డివిడెండ్ ఇచ్చినట్లు తెలిపారు. సంస్థ కేపిటల్ అలోకేషన్ పాలసీ ప్రకారం ఇన్వెస్టర్లకు 2019 ఆర్థిక సంవత్సరంలో రూ.13,000 కోట్లు చెల్లించిందని చెప్పారు. కంపెనీ జూన్ 2018, జనవరి 2019లో రూ.4,740 కోట్ల రెండు ప్రత్యేక డివిడెండ్లు ఇచ్చిందని చెప్పారు.

Infosys creates 36% return for shareholders in FY19

కంపెనీ మార్చి 20వ తేదీన రెండోసారి రూ.8,260 కోట్ల షేర్ బైబ్యాక్ లాంచ్ చేసిందని చెప్పారు. 2017లో తొలిసారి బై బ్యాక్ ద్వారా రూ.5 ముఖ విలువ కలిగిన రూ.13,000 కోట్ల విలువ కలిగిన 11.3 కోట్ల షేర్లను షేర్‌కు రూ.1,150 వద్ద కొనుగోలు చేసినట్లు తెలిపారు. 25 ఏళ్ల సెలబ్రేషన్స్ సందర్భంగా కంపెనీ 1:1 బోనస్ షేర్స్ ఇచ్చిందన్నారు.

2019 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.15,404 కోట్ల ఏకీకృత నెట్ ప్రాఫిట్, రూ.82,675 కోట్ల ఏకీకృత రెవెన్యూ నమోదు చేసినట్లు తెలిపారు. డాలర్ పరంగా నెట్ ఆదాయం 2.2 బిలియన్ డాలర్లు, గ్రాస్ రెవెన్యూ 11.8 బిలియన్ డాలర్లుగా ఉందని చెప్పారు. డిజిటల్ రెవెన్యూ 34 శాతానికి పెరిగిందన్నారు.

వృద్ధి విషయంలో ఇన్ఫోసిస్ సరైన దారిలో పయనిస్తోందన్నారు. సంస్థ పురోగతికి అందరూ శ్రమిస్తున్నారని, వృద్ధిలో పరుగులు పెడుతోందన్నారు. సీఈవో, ఎండీ సలీల్ పరేఖ్ గొప్ప వ్యూహాన్ని నిర్దేశించుకొని, లక్ష సాధన వైపు పయనిస్తున్నారని చెప్పారు. గణాంకాల్లోనే ఇన్ఫోసిస్ వృద్ధిని చూడవచ్చునని చెప్పారు. సంస్థ పని తీరు బాగుందన్నారు. ఉద్యోగులు అందరూ కష్టపడుతున్నారన్నారు.

వివాదంపై...
విశాల్ సిక్కా సీఈవోగా ఉన్న సమయంలో 2015లో ఇజ్రాయిల్‌కు చెందిన ఆటోమేషన్ టెక్నాలజీ సంస్థ పనయాను 200 మిలియన్ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేశారు. ఈ కామర్స్ సర్వీస్ ప్రొవైడర్ స్కావాకు 120 మిలియన్ డాలర్లు వెచ్చించింది. ఈ కొనుగోళ్లకు అధిక ధర చెల్లించినట్లు ఆరోపణలు రావడంతో వివాదాస్పదం అయింది.

ఆ తర్వాత వీటిని విక్రయించాలన్నా కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అనంతరం ఈ రెండు కంపెనీల విలువ పడిపోయింది. దీంతో ఈ కంపెనీలను తీర్చిదిద్దాలని ఇన్ఫోసిస్ నిర్ణయించుకొంది. ఇందుకోసం సీనియర్ మేనేజ్మెంట్ బృందాన్ని సిద్ధం చేశారు. దర్యాఫ్తు నివేదికపై మాట్లాడుతూ.. నివేదిక గోప్యమైందని, చాలామంది దాని గోప్యతపై భరోసా ఇస్తూ ప్రకటనలు చేశారని, అందుకే బోర్డు దానిని అదే పరిస్థితుల్లో కొనసాగిస్తుందన్నారు.

మీరు గవర్నమెంట్ ఉద్యోగి అయితే.. హోమ్‌లోన్స్ చాలా చవక

English summary

ఇన్ఫోసిస్ ఇన్వెస్టర్లకు 2019లో 36 శాతం లాభాలు | Infosys creates 36% return for shareholders in FY19

Infosys, the global software services major, generated 36% return for shareholders in 2018-19, said a top official here on Saturday.
Story first published: Sunday, June 23, 2019, 16:26 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X