న్యూఢిల్లీ/హైదరాబాద్ : సంప్రదాయ వాహనాల తయారీ నుంచి ఎలక్ట్రిక్ మోడళ్లకు మారే ప్రణాళికలను రెండు వారాల్లో సమర్పించాలని ద్వి, త్రిచక్ర వాహన కంపెనీలను నీతి ఆయోగ్ కోరింది. శుక్రవారం నాడు ఆటో కంపెనీలు, ఎలక్ట్రిక్ వాహన స్టార్ట్‌పల ప్రతినిధులతో నీతి ఆయోగ్ సమావేశం జరిగింది. కాలుష్యాన్ని తగ్గించేందుకు కంపెనీలు చర్యలు చేపట్టకపోతే న్యాయస్థానాలు కలుగజేసుకునే అవకాశం ఉందని ఇండస్ట్రీని నీతి ఆయోగ్ హెచ్చరించింది. ఈ భేటీకి బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్, టీవీఎస్ మోటార్ కో-చైర్మన్ వేణు శ్రీనివాసన్, హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ప్రెసిడెంట్, సీఈఓ మినోరు కతో, భారత వాహన తయారీదారుల సంఘం (సియామ్) ప్రెసిడెంట్ విష్ణు మాథుర్, ఆటోమోటివ్ కాంపోనెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ డైరెక్టర్ జనరల్ విన్నీ మెహతాతోపాటు ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.

ఎలక్ట్రిక్ కు మారా మార్గదర్శకాలపై ఆరా..! వాహన కంపెనీలకు గడివు విధించిన నీతి ఆయోగ్..!!
నీతి ఆయోగ్ నుంచి వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్, సీఈఓ అమితాబ్ కాంత్‌లు ఈ సమావేశానికి ప్రాతినిథ్యం వహించారు. ‘స్పష్టమైన విధానం, రోడ్‌మ్యాప్ లేకుండా పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి మారడం జరిగే పనికాదు. భవిష్యత్ విధానాలపై అస్పష్టత వద్దు. ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత కాలుష్య కారకమైన 15 నగరాల్లో 14 భారత్‌కు చెందినవే' అని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు అన్నారు. 2023కల్లా త్రిచక్ర వాహన విభాగంలో, 150సీసీ లోపు ఇంజన్ సామర్థ్యం కలిగిన టూవీలర్ల విభాగంలో 2025కల్లా పూర్తిగా ఎలక్ట్రిక్ మోడళ్లకు మారాలని నీతి ఆయోగ్ వాహన రంగాన్ని కోరుతోంది.

బీఎస్-6కు మారడం సవాలే..! ఐనా ప్రయత్నిస్తామన్న టీవీఎస్..!!
కాలుష్య ఉద్గార ప్రమాణాలైన బీఎస్-4 నుంచి బీఎస్-6కు మారడం వాహన తయారీ రంగం పాలిట సవాలేనని టీవీఎస్ మోటార్ కంపెనీ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) ద్వితీయార్ధం(అక్టోబరు-మార్చి)లో వాహన డిమాండ్ అనిశ్చితి మరింత పెరగవచ్చని అంటోంది. గత ఆర్థిక సంవత్సరం(2018-19)తో పోలిస్తే 2019-20లో ద్విచక్ర వాహన విక్రయాల వృద్ధి 6-8 శాతానికి పరిమితం కావచ్చని టీవీఎస్ మోటార్ అంచనా వేసింది. ఈ ఏడాది వర్షపాతం సాధారణ స్థాయికంటే తగ్గితే టూవీలర్ విక్రయాలపై ప్రభావం చూపవచ్చని గత ఆర్థిక సంవత్సర నివేదికలో కంపెనీ ఆందోళన వ్యక్తం చేసింది.

ఎలక్ట్రిక్ వాహనాల వాటాను 15 శాతానికి పెంచాలి..! కేంద్రం సూచన..!!
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్రం మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా విద్యుత్ వాహనాలకు రిజిస్ట్రేషన్ చార్జీల నుంచి మినహాయింపునివ్వాలని భావిస్తోంది. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ విడుదల చేసిన ఒక ముసాయిదా నోటిఫికేషన్‌లో ఈ మేరకు ప్రతిపాదనలు చేసింది. ద్విచక్ర వాహనాలు సహా అన్ని రకాల విద్యుత్ వాహనాలకు దీన్ని వర్తింపచేయాలని కేంద్రం యోచిస్తోంది. ఈ దిశగా కేంద్రీయ మోటారు వాహనాల చట్టంలోని రూల్ 81కి సవరణలు చేసేలా రహదారుల శాఖ ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. నెల రోజుల్లోగా సంబంధిత వర్గాలు దీనిపై తమ అభిప్రాయాలను తెలియజేయాల్సి ఉంటుందని పేర్కొంది. వచ్చే ఐదేళ్లలో దేశీయంగా విక్రయించే మొత్తం వాహనాల్లో ఎలక్ట్రిక్ వాహనాల వాటాను 15 శాతానికి పెంచాలని కేంద్రం నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే.

2030నాటికల్లా అన్నీ ఎలక్ట్రిక్ వాహనాలే..! ఏర్పాట్లు చేసుకుంటున్న వాహన కంపెనీలు..!!
మారుతున్న కాలంతో పాటు వాతావరణం తొందరగా కలుషితమౌతోంది. కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరో పదేండ్లలో అన్నీ ఎలక్ట్రిక్ వాహనాలే అందుబాటులో ఉండేందుకు చర్యలు ముమ్మరం చేసింది. ఇప్పటికే చాలావరకు ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్లోకి వచ్చినా వాటి వినియోగం తక్కువగా ఉంది. అయితే ఇందుకు సంబంధించి కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నిబంధన 81లో మార్పులు చేస్తున్నట్లు తెలిపింది. కాలుష్యం ఉద్గారాలు వెదజల్లని ఈవీ వాహనాల వినియోగాన్ని భారీగా పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే పదేళ్ల తర్వాత కేవలం ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలకు మాత్రమే అనుమతి ఇవ్వాలని నీతి అయోగ్ సూచిస్తోంది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications