ఎలక్ట్రిక్ వెహికిల్స్ (విద్యుత్ ఆధారిత -EV) వాహనాలపై కేంద్ర ప్రభుత్వం మరిన్ని వెసులుబాట్లు కల్పించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రిజిస్ట్రేషన్, పునరుద్ధరణ సమయంలో ఛార్జీలు మినహాయించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఈ రోజు (21 జూన్) జీఎస్టీ కౌన్సెల్ భేటీ ఉంది. ఈ భేటీలో ఎలక్ట్రిక్ వెహికిల్స్‌ను తక్కువ శ్లాబ్‌లోకి తీసుకువచ్చేలా నిర్ణయం తీసుకోవచ్చునని భావిస్తున్నారు.
ప్రస్తుతం ఎలక్ట్రిక్ వెహికిల్స్ వాహనాలపై జీఎస్టీ 12 శాతంగా ఉంది. దీనిని 5 శాతం శ్లాబ్‌లోకి తీసుకు వచ్చే అవకాశాన్ని నేటి జీఎస్టీ మండలి 35వ సమావేశం నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్, హైబ్రిడ్ వెహికిల్స్ 28 శాతం శ్లాబ్‌లో ఉన్నాయి. ఆర్థిక మంత్రిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ నేతృత్వంలో ఇది మొట్టమొదటి జీఎస్టీ మండలి సమావేశం.

పన్ను ఎగవేతల నియంత్రణకు సంబంధించి పలు కీలక చర్యలు చేపట్టే అవకాశముంది. రూ.50 కోట్ల కంటే అధిక టర్నోవర్ కలిగిన సంస్థలు విక్రయించే వాటిపై ఖచ్చితంగా ఈ ఇన్వాయిస్ ఉండాలని, అన్ని సినిమా హాళ్లలో ఖచ్చితంగా ఈ టిక్కెటింగ్ ఉండాలే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరే అవకాశం కూడా ఉంది. ల్యాటరీపై విధించే జీఎస్టీ రేటును కూడా నిర్ణయించే అవకాశముంది.
మరోవైపు ఎలక్ట్రిక్ ఛార్జీలను కూడా 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించే అవకాశాలు ఉన్నాయి. 2020 ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఎన్‌హెచ్ఏఐ ఫాస్ట్ ట్యాగ్ వ్యవస్థతో ఈ-వే బిల్లులు అనుసంధానం చేయనున్నారు. యాంటీ ప్రాఫిటింగ్ అతారిటీ కాలపరిమితిని మరో ఏడాది పాటు అంటే 2020 నవంబర్ వరకు పొడిగింపుపై చర్చించనున్నారు.
More From GoodReturns

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications