న్యూఢిల్లీ: విద్యుత్ ఆధారిత (electric vehicles-EV) వాహనాలు కొనుగోలు చేసే వారికి కేంద్ర ప్రభుత్వం బంపరాఫర్. EVలకు రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని మోడీ నేతృత్వంలోనికేంద్రం ప్రతిపాదించింది. పర్యావరణ హిత వాహనాల వినియోగానికి ఊతమివ్వడంలో భాగంగా ఎన్డీయే సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. కాలుష్యం అంతకంతకు పెరగడం, ఉద్గారాలు వెదజల్లని EVవాహనాల వినియోగాల ప్రోత్సాహం కోసం ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకుంది.

2030 నాటికి అత్యధిక వాహనాలు EVలు ఉండే లక్ష్యంతో...
2030నాటికి దేశీయంగా అత్యధిక వాహనాలు విద్యుత్‌తో నడిచేవి ఉండాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. బ్యాటరీతో నడిచే కొత్త వాహనాల రిజిస్ట్రేషన్, పునరుద్ధరణ సమయంలోనూ ఛార్జీల నుంచి మినహాయింపు ఇవ్వాలని డ్రాఫ్ట్ ప్రతిపాదించారు. ఈ అంశంపై ముప్పై రోజుల్లో అభిప్రాయాలు తెలపాలి. అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న అనంతరం నోటిఫికేషన్ జారీ చేస్తారు. విద్యుత్‌తో నడిచే ప్రయివేటు వాహనాలకు ఆకుపచ్చ నెంబరు ప్లేటు పైన తెల్లటి అక్షరాలు, ట్యాక్సీలపై పసుపురంగు అక్షరాలు ముద్రించాలని నిర్ణయించారు.

30 రోజుల్లో అభిప్రాయాలు
ఈ మేరకు నిబంధన 81లో మార్పులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్, పాత వాహనాల రెన్యువల్ కోసం ఎలాంటి చెల్లింపులు చేయనవసరం లేదని పేర్కొంది. ఎలక్ట్రిక్ టూవీలర్లతోపాటు త్రీ-వీలర్, ఫోర్-వీలర్ మిగతా అన్ని విద్యుత్ ఆధారిత వాహనాలకు ఇది వర్తిస్తుందని తెలిపింది. వీటిపై నెల రోజుల్లో అభిప్రాయాలు తెలపాలని రవాణా మంత్రిత్వ శాఖ కోరింది.

కేవలం EV సేల్స్ ఉండేలని సూచనలు
అన్ని రకాల EVలకు రిజిస్ట్రేషన్ రద్దు వర్తిస్తుంది. 2030 వరకు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలని, అలాగే, పదేళ్ల తర్వాత (2030) కేవలం ఎలక్ట్రిక్ వాహనాల సేల్స్‌కు మాత్రమే అనుమతి ఇవ్వాలని నీతి అయోగ్ కూడా సూచనలు చేసిందని తెలుస్తోంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications