దేశీయ రియల్ ఎస్టేట్ రంగంలోనే కాకుండా విదేశాల్లోనూ రియల్ ఎస్టేటుపై భారతీయులు పెట్టుబడులు జోరుగా పెరుగుతున్నాయి. రాబడులు పెంచుకునే ఉద్దేశంతో విదేశీ పెట్టుబడులు పెంచుకుంటున్నారు. ఈ ఏడాది మార్చితో ముగిసిన పన్నెండు నెలల కాలంలో కమర్షియల్ రియల్ ఎస్టేట్ రంగంలో భారత్ విదేశీ మూలధన పెట్టుబడులు ఏకంగా 92 శాతం పెరిగి 0.7 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని నైట్ ప్రాంక్ అనే ఇండిపెండెంట్ గ్లోబల్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ తాజా నివేదిక వెల్లడించింది. యునైటెడ్ కింగ్ డమ్, నెదర్లాండ్స్, జర్మనీ, యునైటెడ్ స్టేట్స్ అఫ్ అమెరికా, ఆస్ట్రేలియా వంటివి భారత్ విదేశీ మూలధన పెట్టుబడుల్లో టాప్ 5 స్థానాల్లో నిలిచాయి. ఇక ఏడాది కాలంలో దేశీయ రియల్ కమర్షియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు 260 కోట్ల డాలర్లకు చేరాయి.

భారత వాణిజ్య రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు
మన దేశంలోని వాణిజ్య రియల్ ఎస్టేట్ రంగంలోకి విదేశీ పెట్టుబడులు బాగానే వస్తున్నాయి. ఈ ఏడాది మొదటి త్రైమాసికంతో ముగిసిన పన్నెండు నెలల కాలానికి సింగపూర్ పెట్టుబడులు అధికంగా ఉన్నాయి. తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా, జపాన్, చైనా, హాంకాంగ్ నిలిచాయి. విదేశీ పెట్టుబడులను ఆకర్షించిన దేశాల్లో భారత్ 20వ స్థానంలో నిలిచింది.

ఆసియా పసిఫిక్ విదేశీ మూలధనం
గత ఏడాది మొదటి త్రైమాసికం నుంచి ఈ ఏడాది మొదటి త్రైమాసికం వరకు ఆసియా పసిఫిక్ దేశాల విదేశీ పెట్టుబడులు 34 శాతం తగ్గి 8,800 కోట్ల డాలర్ల నుంచి 5,700 కోట్ల డాలర్లకు తగ్గాయి. ఇదే కాలంలో ఉత్తర అమెరికా పెట్టుబడులు 11,000 కోట్ల డాలర్లు, యూరప్ పెట్టుబడులు 10,400 కోట్ల డాలర్లుగా ఉన్నాయి. ఇక పొరుగు దేశం చైనా విదేశాల్లో పెట్టుబడులు బాగానే తగ్గాయి. ఈ దేశానికి విదేశాల నుంచి పెట్టుబడులు ఎక్కువగా వచ్చాయి. ఇదే కాలంలో విదేశీ పెట్టుబడుల విషయంలో హాంకాంగ్ ను సింగపూర్ దాటేసింది. సింగపూర్.. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో చైనా, దక్షిణ కొరియా, యూకే, ఆస్ట్రేలియాల్లో 400 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టింది.

అమెరికా ఫస్ట్
మూలధన పెట్టుబడుల దేశాల్లో అమెరికా అగ్ర స్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో కెనడా, జర్మనీ, సింగపూర్, యునైటెడ్ కింగ్ డమ్, ఫ్రాన్స్, హాంకాంగ్, స్విట్జర్లాండ్, దక్షిణ కొరియా, చైనా భారత్ ఉన్నాయి.

రిస్క్ తగ్గించుకునేందుకే...
దేశంలోని ఇన్వెస్టర్లు అధిక రిటర్న్ లు వచ్చే పెట్టుబడులపై దృష్టి సారిస్తున్నారు. అంతర్జాతీయంగా వివిధ దేశాల మధ్య వాణిజ్య యుద్ధ వాతావరణం మరింత ఆందోళన కరంగా మారుతోంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో సాగుతోంది. మరో మాంద్యం వస్తుందా అన్న ఆందోళనలు రేగుతున్నాయి. మరోవైపు వడ్డీ రేట్లు ఆకర్షణీయంగా లేవు. ఈ నేపథ్యంలో రిస్కును తగ్గించుకునేందుకు, ఎక్కువ రాబడులను అందుకోవడానికి విదేశీ రియల్ ఎస్టేట్ పై దృష్టిసారిస్తున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు.
More From GoodReturns

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications