అమరావతి: నవ్యాంధ్రప్రదేశ్‌లో ఏడింట ఆరొంతుల మెజార్టీతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ప్రమాణ స్వీకారం చేపట్టిన కొద్దిరోజుల్లోనే మేనిఫెస్టోలో ఇచ్చిన పలు హామీలను అమలు చేసారు. ఈ నేపథ్యంలో మిగతా హామీలపై కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆయన ఇచ్చిన హామీలు, వాటికి అయ్యే బడ్జెట్‌పై లెక్కలు వేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టే తొలి బడ్జెట్‌లో ఏ మేరకు హామీల అమలును నెరవేరుస్తారు, ప్రజలకు ఏం గుడ్ న్యూస్ చెబుతారనే ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో జగన్ ఇచ్చిన కొన్ని హామీలు చూద్దాం. ఇందులో పలు హామీలు నెరవేర్చారు. మరికొన్నింటిని నెరవేరుస్తామని చెప్పారు.
చదవండి: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి తెలుసా?: త్వరలో ప్రజల ముందుకు జగన్, ఏం కోరుకుంటున్నారు

నవరత్నాలు.. హామీలు
వైయస్ జగన్ ప్రధానంగా నవరత్నాలు ప్రకటించారు. ఈ మేనిఫెస్టోను వెబ్‌సైట్‌లో పెట్టి, కచ్చితంగా అమలు చేసిన తర్వాతే 2024లో ఓట్లు అడుగుతామని చెప్పారు. రైతులకు ఉచిత బోర్లు, కౌలు రైతులకు వడ్డీలేని రుణాలు. రైతులకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ. అక్వా రైతులకు యూనిట్‌కు రూపాయికే విద్యుత్. ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లు రైతులకు రూ.50,000 పెట్టుబటి సాయం. రైతు కుటుంబాలకు రూ.7 లక్షల బీమా. రైతులకు సున్నా వడ్డీకే రుణాలు. పంట ధర ముందే నిర్ణయం. అదే రేటుకు ఎవరూ కొనకపోతే ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. కేంద్రంతో కలిసి రూ.4వేల కోట్లతో ప్రకృతి విపత్తు పరిహార నిధి ఏర్పాటు. ప్రతి మండలంలో కోల్డ్ స్టోరేజీలు, గోదాముల నిర్మాణం. రైతులు ఉచితంగా ఉపయోగించుకునే వెసులుబాటు.

పింఛన్లు
వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకు రావడం. ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా దశ దిశ మార్చడం, కిడ్నీ సహా దీర్ఘకాలిక వ్యాదిగ్రస్తులకు నెలకు రూ.10వేల పింఛన్. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో సరే ఎక్కడైనా ఆరోగ్యశ్రీ వర్తింపు. వృద్ధాప్య పింఛన్ రూ.3వేలకు పెంపు. పింఛన్ అర్హత 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గింపు. అగ్రిగోల్డ్ బాధితులకు రూ.1150 కోట్లు కేటాయింపు. దశలవారీగా మద్యపాన నిషేధం. ఖాళీగా ఉన్న లక్షా 30వేల ఉద్యోగాల భర్తీ. అయిదేళ్లలో 25 లక్షల ఇళ్ల నిర్మాణం, శ్రీవారి సన్నిధిలు తలుపులు తీసే అవకాశం గొల్లలకు కల్పించడం.. ఇలా పలు హామీలు ఇచ్చారు.

అమ్మఒడి పథకం
ఎస్సీ, ఎస్టీ అమ్మాయిల పెళ్లి కానుక కింద రూ.లక్ష, బీసీ అమ్మాయిలకు రూ.50వేల ఆర్థిక సాయం. కాపు కార్పోరేషన్‌కు రూ.2వేల కోట్లు. బీసీ, ఎస్సీ కార్పోరేషన్లు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు. అర్చకులకు రిటైర్మెంట్ విధానం రద్దు. అర్చకులకు ఇళ్ల స్థలాలు కేటాయించి, ఇళ్ల నిర్మాణం. పిల్లల్ని బడికి పంపిస్తే ప్రతి తల్లికి ఏడాదికి అమ్మఒడి పథకం కింద రూ.15,000. ఇతర ప్రాంతాల్లో చదువుకునే పిల్లలకు హాస్టల్ ఖర్చు కింద రూ.20,000. పింఛన్ల పెంపు. వికలాంగులకు రూ.3వేలు. ఇళ్లులేని పేదలకు వారి పేరు మీదే ఇంటిస్థలం కొని రిజిస్ట్రేషన్. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు 45 ఏళ్లకే వైయస్సార్ చేయూత.

ఇంటికే రేషన్ సరుకులు
వివిధ ప్రాజెక్టుల పూర్తి. చెరువుల పునరుద్ధరణ. రక్షిత మంచినీరు అందించడం. ప్రత్యేక హోదా సాధన కోసం పోరాటం. గ్రామ సచివాలయం ఏర్పాటు ద్వారా అదే గ్రామానికి చెందిన యువకులకు ఉద్యోగ అవకాశం. ప్రతి గ్రామంలో 50 ఇళ్లకు ఒక వాలంటీర్. వారికి నెలకు రూ.5వేల వేతనం. ప్రభుత్వ పథకాల తీరును వారే అమలు చేస్తారు. రేషన్ వస్తువులు ఇంటికే తెచ్చి ఇవ్వడం. పరిశ్రమలకు కావాల్సిన స్కిల్స్ ఆదారంగా యువతకు శిక్షణ. బీసీల అభ్యున్నతికి రూ.15వేల కోట్ల చొప్పున అయిదేళ్లలో రూ.75వేల కోట్లు ఖర్చు. దేవాలయాల ట్రస్ట్ బోర్డులు, మార్కెట్ కమిటీలు, అన్ని కార్పోరేషన్లలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం రిజర్వేషన్. ప్రాతినిథ్యం లేని కులాలకు చట్టసభల్లో అవకాశం. మత్స్యకారుల పడవలకు ఆర్థిక సాయం. ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా. మగ్గం ఉన్న ప్రతి కుటుంబానికి సంవత్సరానికి రూ.24వేలు. చిరు వ్యాపారస్తులకు గుర్తింపు కార్డు. సున్నాకే రూ.10వేల వడ్డీ.

గుడి, చర్చి, మసీదుకు ప్రభుత్వ సాయం
ఆర్యవైశ్యులకు కార్పోరేషన్. జూనియర్ లాయర్లకు ప్రతి నెల రూ.5వేల స్టైఫండ్. మైనార్టీ సబ్ ప్లాన్ పారదర్శకంగా అమలు. వక్ఫ్ ఆస్తుల డిజిటలైజేషన్. ముస్లీం మైనార్టీల ఆడబిడ్డల పెళ్లిళ్లకు రూ.1 లక్ష సాయం. ఇమామ్‌లకు రూ.10వేలు, మౌజన్‌లకు రూ.5వేలు. సీపీఎస్ రద్దు. పాత పెన్షన్ విధానం అమలు. దఫాలుగా మద్య నిషేదం ఎత్తివేత. మసీదు, చర్చి, గుడికి ప్రభుత్వ సాయం. ఒక్కో దానికి రూ.15వేలు. ప్రతి జర్నలిస్ట్‌కు ఇళ్లస్థలం.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications