వాషింగ్టన్: పెద్ద పెద్ద కంపెనీలపై స్క్రూటిని సమంజసమేనని, కానీ నియంత్రించాలి కాబట్టి నియంత్రణలు విధించాలనుకుంటే మాత్రం ఆమోదయోగ్యం కాదని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అన్నారు. ఆయన సీఎన్ఎన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. పెద్ద కంపెనీలను నియంత్రించాలనే ఉద్దేశ్యంతోనే నియంత్రణలు విధిస్తే అందుకు సంబంధించిన పరిణామాలు ఊహకు కూడా అందవన్నారు.

యాంటీ ట్రస్ట్ వయోలేషన్ దర్యాఫ్తు నేపథ్యంలో గూగుల్ సెర్చ్ బిజినెస్, అడ్వర్టయిజ్‌మెంట్ ప్రాక్టీసెస్ స్క్రూటినిని ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్తలు వచ్చిన నేపథ్యంలో సుందర్ పిచాయ్ స్పందించారు. గూగుల్, ఫేస్‌బుక్, యాపిల్, అమెజాన్‌ల పర్యవేక్షణ కోసం యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ (DOJ), ఫెడరల్ ట్రేడ్ కమిషన్ బాధ్యతలను పంచుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
స్క్రూటినీ నిర్ణయం సరైనదేనని, కానీ నిర్మాణాత్మక చర్చల్లోను తాము పాల్గొంటామని చెప్పారు. కేవలం నియంత్రించాలని నియంత్రించాలని చూస్తే మాత్రం అది అనాలోచిత నిర్ణయమని, దీని పట్ల తాము ఆందోళన వ్యక్తం చేస్తున్నామన్నారు. తాము స్క్రూటినీని యూరోప్‌లోను ఎదుర్కొన్నామని, తమకు ఇది కొత్త కాదని, కొన్ని ఇతర కంపెనీలకు కొత్త కావొచ్చునని చెప్పారు.
యాంటీ ట్రస్ట్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి గూగుల్‌పై కేసులు పెట్టేందుకు యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ (DOJ) సిద్ధమవుతోంది. 2010లో షాపింగ్ సెర్చ్ రిజల్ట్స్‌కు గూగుల్ వివక్షాపూరితంగా వ్యవహరిస్తోందని 2010లో ఫిర్యాదు దాఖలైంది. దీంతో 2017లో గూగుల్ పైన 2.7 బిలియన్ డాలర్ల జరిమానా విధించారు.
More From GoodReturns

ఈస్టర్ 2026: గుడ్ ఫ్రైడే, పామ్ సండే, లెంట్ తేదీల పూర్తి వివరాలు ఇవిగో..

ఉచితంగా AI కోర్సులు నేర్చుకునే అవకాశం! ఎలా రిజిస్టర్ అవ్వాలి? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్..

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

ఇరాన్ మా షరతులకు ఒప్పుకుంది..అణ్వాయుధాలు విడిచిపెడుతోంది..ట్రంప్ సంచలన ప్రకటన..

భారతదేశంలో లాక్డౌన్.. గూగుల్‌లో తెగ వెతికేస్తున్న నెటిజన్లు.. వెస్ట్ ఆసియా దేశాల్లో ఎమర్జెన్సీ ప్రకటన..

ఇరాన్ యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రకటన.. చారిత్రాత్మక ఒప్పందంపై ఏమన్నారంటే..

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

పాకిస్తాన్లా బ్రోకర్ పనులు భారత్ ఎప్పటికీ చేయదు.. ట్రంప్‌తో ఫోన్లో ప్రధాని మోదీ మాట్లాడారు: జైశంకర్

చమురు సంక్షోభంలో స్నేహితుడికి అండగా రష్యా.. భారత రిఫైనరీ కంపెనీలకు 6 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు సరఫరా

హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన..శత్రుదేశాల నౌకలకు ప్రవేశం లేదని స్పష్టం చేసిన టెహ్రాన్..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..



Click it and Unblock the Notifications