న్యూఢిల్లీ: ఫోర్బ్స్ మేగజేన్స్ గ్లోబల్ 2000 జాబితాలో భారత్‌కు చెందిన 57 కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. ఈ మేరకు ఫోర్బ్స్ గురువారం వెల్లడించింది. అంతర్జాతీయంగా టాప్ 10 ఆర్థిక సంస్థల్లో హెచ్‌డీఎఫ్‌సీ ఉంది. ఈ జాబితాలో ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆప్ చైనా (ICBC) తొలి స్థానంలో ఉంది. ఇది మొదటి స్థానంలో ఉండటం వరుసగా ఏడోసారి. ఆ తర్వాత జేపీ మోర్గాన్, చైనా కన్స్ట్ర క్షన్ బ్యాంక్, అగ్రికల్చర్ బ్యాంక్ ఆఫ్ చైనా, బ్యాంక్ ఆఫ్ అమెరికా, యాపిల్, పింగ్ ఆన్ ఇన్సురెన్స్ గ్రూప్, బ్యాంక్ ఆఫ్ చైనా, రాయల్ డచ్ షెల్, వెల్స్ ఫార్గోలు ఉన్నాయి.
ఇంటర్ విద్యార్థులకు HCL 'టెక్ బీ'సూపర్ ఆఫర్

71వ స్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్
భారత్ నుంచి ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్ర్సీ 71వ స్థానంలో నిలిచింది. ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్ కంపెనీల్లో రాయల్ డచ్ షెల్ మొదటి స్థానంలో నిలిచింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రపంచంలోనే 11 స్థానంలో నిలిచింది. కన్స్యూమర్ ఫైనాన్షియల్ సెక్టార్‌లో అమెరికన్ ఎక్స్‌ప్రెస్ తొలి స్థానంలో, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ 7వ స్థానంలో నిలిచింది. మొత్తంగా 2,000 లిస్ట్‌లో హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ 332వ స్థానంలో ఉంది.

అమెరికా నుంచి 575
ఈ జాబితాలో 61 దేశాలకు చెందిన కంపెనీలు ఉన్నాయి. ఇందులో కేవలం అమెరికా నుంచి 575, ఆ తర్వాత చైనా అండ్ హాంగ్‌కాంగ్ నుంచి 309, జపాన్ నుంచి 223 కంపెనీల ఉన్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ 71వ స్థానంలో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 209వ స్థానంలో, ONGC 220వ స్థానంలో, ఇండియన్ ఆయిల్ 288వ స్థానంలో HDFC Ltd 332వ స్థానంలో నిలిచాయి. టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంకు, ఎల్ అండ్ టీ, ఎస్బీఐ, ఎన్టీపీసీలు టాప్ 500 జాబితాలో చోటు దక్కించుకున్నాయి.

భారత్ నుంచి...
టాప్ 2000లో టాటా స్టీల్, కోల్ ఇండియా, కొటక్ మహీంద్రా బ్యాంకు, భారత్ పెట్రోలియం, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంకు, టాటా మోటోరాస్, ఐటీసీ, భారతీ ఎయిర్‌టెల్, విప్రో, జెఎస్‌డబ్ల్యు స్టీల్, పవర్ గ్రిడ్, హిండాల్కో, హెచ్‌సీఎల్ టెక్, ఎం అండ్ ఎం, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజా ఫైన్‌సర్వ్, గెయిల్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, గ్రాసిమ్, బ్యాంక్ ఆఫ్ బరోడా, పవర్ ఫైనాన్స్, కెనెరా బ్యాంక్‌లు ఉన్నాయి. భారత్ నుంచి కేవలం రిలయన్స్ ఇండస్ట్రీస్ మాత్రమే టాప్ 200 జాబితాలో ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్(209), ఓఎన్జీసీ(220), ఇండియన్ ఆయిల్(288) ఉన్నాయి.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications