లండన్: ప్రముఖ ఆర్థిక నిపుణులు రఘురాం రాజన్‌కు అరుదైన అవకాశం రాబోతుందా? అంటే అవుననే వార్తలు వస్తున్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ గవర్నర్ రేసులో ఈయన కూడా ఉన్నారని మీడియాలో వార్తలు వచ్చాయి. ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ గవర్నర్‌గా మార్క్ కార్నే ఉన్నారు. పదవీ కాలం వచ్చే ఏడాది ముగియనుంది. ఆయన స్థానంలో కొత్త గవర్నర్ రేసులో అందరికంటే ముందు రఘురాం రాజన్ ఉన్నారని తెలుస్తోంది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ విదేశీయులకు అవకాశమిస్తుంది.
బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ గవర్నర్ పదవికి పోటీ పడుతున్న యునైటెడ్ కింగ్‌డమ్‌యేతర ఆర్థికవేత్తల్లో రఘురాం రాజన్ ఒక్కరే కావడం గమనార్హం. ప్రస్తుతం బ్రిటన్‌లో బ్రెగ్జిట్ అనిశ్చితి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో థెరిసా మే రాజీనామా కూడా చేశారు. అనిశ్చిత పరిస్థితుల్లో రఘురాం రాజన్ వైపు చూస్తున్నట్లుగా కనిపిస్తోంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా 325 ఏళ్ల చరిత్ర కలిగిన సంస్థ. అయితే దీనిపై ఇటు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ లేదా రఘురాం రాజన్ కానీ స్పందించలేదు.

బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ గవర్నర్ పదవికి దరఖాస్తులు గత వారం ముగిశాయి. రఘురాం రాజన్ రేసులో ఉన్నారని బ్లూమ్‌బర్గ్ వార్త ఇచ్చింది. ఈ విషయమై ఆయనను అదే మీడియా సంస్థ కాంటాక్ట్ చేయగా అతను మాట్లాడేందుకు నిరాకరించారని తెలుస్తోంది. ప్రస్తుతం బ్యాంక ఆఫ్ ఇంగ్లాండ్ గవర్నర్ రేసులో రఘురామ్ రాజన్‌తో పాటు ముగ్గురు ఉన్నారు. డార్ట్‌మౌత్ కాలేజ్ ఎకనమిక్స్ ప్రొఫెసర్ డేవిడ్ బ్లాంచ్‌ప్లవర్, బీఓఐ ఫైనాన్షియల్ రెగ్యులేటర్‌గా పనిచేసిన అనుభవమున్న ఆండ్రూ బైలీ గవర్నర్ పోస్టుకు పోటీ పడుతున్నారు. వీరిద్దరి కంటే రాజన్ ముందున్నారు. బ్రెగ్జిట్ ప్రక్రయ పూర్తయ్యాక స్పష్టత రానుంది.
రఘురాం రాజన్ ఇండియన్ ఎకనమిస్ట్. ఇంటర్నేషనల్ అకడమిషియన్. ఈయన 23వ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్. సెప్టెంబర్ 2013 నుంచి సెప్టెంబర్ 2016 వరకు పని చేశారు. 3 ఫిబ్రవరి 1963లో జన్మించారు. ప్రస్తుతం చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ప్రొఫెసర్ ఆఫ్ ఫైనాన్స్‌గా ఉన్నారు. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్‌లో చీఫ్ ఎకనమిస్ట్‌గా పని చేశారు. రఘురాం రాజన్ వయస్సు 56 ఏళ్లు.
భారత్‌లో గత సార్వత్రిక ఎన్నికలు జరిగిన సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఆయన న్యాయ్ స్కీం సూచన చేశారు. ప్రతి పేద కుటుంబానికి కనీస ఆదాయం రూ.12వేలుగా ఉండేలా చూసేదే న్యాయ్ స్కీం. తాము అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి కనీస ఆదాయం రూ.12 వేలు ఉండేలా చూస్తామని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications