For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సపోర్ట్ లేకుండా రూ.35వేల కోట్ల రుణాలు తీర్చాం: ప్రచారంపై అనిల్ అంబానీ ఆవేదన

|

ముంబై: రిలయన్స్ అడాగ్ (R-ADAG) చైర్మన్ అనిల్ అంబానీ ఇన్వెస్టర్లకు మరోసారి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. తమ కంపెనీ 2018 ఏప్రిల్ నుంచి అంటే ఈ పద్నాలుగు నెలల్లో రూ.35వేల కోట్ల అప్పులను తిరిగి చెల్లించిందని చెప్పారు. అనిల్ అంబానీ గ్రూప్ రిలయన్స్ అప్పుల ఊబిలో కూరుకుపోయిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా షేర్లు విక్రయించి, అప్పులు చెల్లిస్తున్నారు.

జియో దెబ్బ... వొడాఫోన్ సరికొత్త ఆఫర్: రూ.299 ప్లాన్ వివరాలివజియో దెబ్బ... వొడాఫోన్ సరికొత్త ఆఫర్: రూ.299 ప్లాన్ వివరాలివ

ఆయన మంగళవారం నాడు మీడియాతో మాట్లాడారు. భవిష్యత్తులో తాము చెల్లించాల్సిన రుణాలన్నింటినీ అసెట్‌ మానిటైజేషన్‌ ప్లాన్‌ కింద చెల్లిస్తామని హామీ ఇచ్చారు. పలు సవాళ్లు, కఠిన పరిస్థితుల మధ్య ఏప్రిల్‌ 2018 నుంచి మే 2019 వరకూ రిలయన్స్ గ్రూప్‌నకు చెందిన 35వేల కోట్ల రుణాలు రుణాలు చెల్లించామన్నారు. ఫైనాన్షియర్స్ నుంచి తమకు ఎలాంటి సహాయం లభించలేదన్నారు. రుణాల చెల్లింపులు వెనక్కి తగ్గేది లేదని, అందరి అప్పులు తీరుస్తామన్నారు.

R ADAG committed to pay debt, assures Anil Ambani

ఇందులో రూ.24,800 కోట్లు అసలు అని, సుమారు రూ.10,600 కోట్లు వడ్డీ అని చెప్పారు. అసెట్ మానిటైజేషన్ ప్లాన్‌ కింద ఈ మొత్తాన్ని చెల్లించామని, భవిష్యత్‌లోనూ సమయానికి అన్ని చెల్లింపులు చేస్తామని చెప్పారు. కొద్ది రోజులుగా తమపై, కంపెనీపై దుష్ప్రచారం సాగుతోందని, ఇది రిలయన్స్ కంపెనీల షేర్ల ప్రభావం చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్వెస్టర్లలో సంస్థపై నమ్మకం కోల్పోయేలా చేస్తోందన్నారు.

ఆర్థికపరమైన సవాళ్లు, ఇబ్బందులున్నా రుణాలను పూర్తిగా తీర్చడానికి కట్టుబడి ఉన్నామన్నారు. ఈ పక్రియ వివిధ దశల్లో ఇప్పటికే అమల్లో ఉందన్నారు. ఈ క్రమంలో రిలయన్స్‌ గ్రూపునకు చెందిన వాటాదారులు, ఉద్యోగుల పూర్తి మద్దతు తమకు లభిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

English summary

సపోర్ట్ లేకుండా రూ.35వేల కోట్ల రుణాలు తీర్చాం: ప్రచారంపై అనిల్ అంబానీ ఆవేదన | R ADAG committed to pay debt, assures Anil Ambani

Anil Ambani ostensibly sought to reassure investors and debtors on Tuesday, saying that his Reliance-ADAG has serviced debt obligations worth Rs 35,000 crore in the last 14 months since April 2018 despite severe odds, and remains committed to meeting all future obligations.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X