వాషింగ్టన్: అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ హెచ్1బీ వీసా నిబంధనల నేపథ్యంలో EB5 వీసా దరఖాస్తులు వేగంగా పెరుగుతున్నాయట. గ్రీన్ కార్డు త్వరగా వచ్చేందుకు దీనిని దరఖాస్తు చేస్తున్నారు. EB5 దరఖాస్తుల అప్లికేషన్లు ఏకంగా 300 శాతం పెరిగాయట. 2017తో పోల్చుకుంటే పెద్ద ఎత్తున పెరిగాయని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, టెక్కీలు అమెరికా వెళ్లేందుకు ఉపయోగపడే హెచ్1బి వీసాల ప్రాసెసింగ్ జూన్ 10వ తేదీ నుండి ప్రారంభం కానుందని అమెరికా సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీస్ (యూఎస్‌సీఐఎస్) తెలిపింది. ఇందుకోసం రెండు దశల్లో ప్రీమియం ప్రాసెసింగ్ సేవల్ని అందిస్తోంది. ఇప్పటికే తొలిదశలో భాగంగా ఏప్రిల్ 1నుంచి 2020 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన హెచ్1బి కాప్ వీసాలను పరిశీలిస్తోంది. వీటిని అమెరికాలో మాస్టర్ చేసిన వారికి ఇస్తారు.

ఇందులో విద్యార్థులుగా ఎఫ్ 1 వీసాలను కలిగి ఉండి, ఆప్షనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ (ఓపీటీ) కింద ఉద్యోగాలు చేసే వారికి యజమానులు స్పాన్సర్ చేసే హెచ్1బి వర్క్ వీసాలు కూడా ఉన్నాయి. ఇందుకు సంబంధించిన రెండో దశ జూన్ నెలలో ప్రారంభం కానుంది. ఇప్పుడు ఇండియన్స్‌కు ఉద్యోగాలను ఇచ్చిన కంపెనీలు కొంతమొత్తం చెల్లించి వేగంగా వీసాలు పొందవచ్చు. ఈ చెల్లింపు చేసిన వీసాల పరిశీలన పదిహేను రోజుల్లోపు పూర్తవుతుంది. ఏదేని పరిస్థితుల్లో దరఖాస్తు తిరస్కరించబడితే సవరణలతో మళ్లీ అప్లై చేసుకోవచ్చు.
More From GoodReturns

ఇరాన్ యుద్ధం వేళ అమెరికాను చావు దెబ్బ కొట్టిన చైనా.. బుల్లెట్ పేల్చకుండానే అగ్రరాజ్యంపై కొత్త వార్..

ఇరాన్ యుద్దం ముగుస్తుందనే అంచనాలు.. తగ్గిన ముడి చమురు ధరలు.. ట్రంప్ ఏమన్నారంటే..

అమెరికాలో ఛాయ్ వాలాగా మారిన భారత ఐటీ ఉద్యోగి.. రోజూ వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

ముంచుకొస్తున్న 1970 చమురు సంక్షోభం.. ధరల పెరుగుదలతో పలు దేశాలు విలవిల..

Russian oil: ట్రంప్ క్లెయిమ్ VS రియాలిటీ.. రష్యా ఆయిల్ కొనుగోలుపై క్లారిటీ ఇచ్చిన న్యూఢిల్లీ!

Iran war: ఇరాన్లో హై అలర్ట్: ఖమేనీ అంత్యక్రియలు వాయిదా.. ఏం జరుగుతోంది?

ఇరాన్ మీద దాడులు.. బట్ట బయలైన అమెరికా కుట్రలు.. ప్రపంచానికి నిజాన్ని తెలిపిన స్పెయిన్..

ఇరాన్–అమెరికా యుద్ధంపై షాకింగ్ న్యూస్.. ఎవరి ఆయుధాలు ముందుగా అయిపోతాయో తెలుసా..

భారత ఆర్థిక వ్యవస్థని కుదిపేస్తున్న గల్ఫ్ యుద్ధ మంటలు.. ప్రమాదంలో 9 కోట్ల మంది పంపే డబ్బు ..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..



Click it and Unblock the Notifications