నేడే ఆర్బీఐ మీటింగ్ ! వడ్డీ రేట్లు ఎంత తగ్గొచ్చో తెలుసా ?

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురువారం మధ్యాహ్నం తన పరపతి విధాన సమీక్షను ప్రకటించబోతోంది. మూడు రోజుల పాటు భేటీ అయిన మానిటరీ పాలసీ కమిటీ తమ నిర్ణయాలను వెల్లడించబోతున్నారు. ఇంతకీ వడ్డీ రేట్లు తగ్గిస్తారా లేక అలానే ఉంచుతారా అనేదే ప్రస్తుతం ఆసక్తికరంగా కనిపిస్తున్న అంశం. అయితే పావు శాతం వరకూ వడ్డీ రేట్లలో కోత ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

వడ్డీ రేట్లు ఎంత తగ్గుతాయి ?

మోడీ సర్కార్ రెండోసారి మరింత పటిష్టంగా అధికార పగ్గాలు చేపట్టింది. గతంలో చేయలి అనుకుని అప్పట్లో చేయలేకపోయిన కొన్ని పనులను పూర్తిగా చక్కబెట్టాలనే నిర్ణయంతో ఉంది మోడీ అంట్ టీం. అందుకే ఈ సారి ఆర్బీఐపై పరోక్షంగా అయినా కొద్దిగా ఒత్తిడి తెచ్చి వడ్డీ రేట్లను మరింత దించవచ్చని భావిస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం రిటైల్ ఇన్‌ఫ్లేషన్ అందుబాటులోనే ఉంది. ఇది వడ్డీ రేట్లు తగ్గించేందుకు దోహదపడ్తుంది. అయితే జీడీపీ వృద్ధి రేటు 17 నెలల కనిష్ట స్థాయికి పడిపోవడం ఒకింత ఆందోళన కలిగించే అంశమే అయినా అది తాత్కాలికమేనని ఆర్థిక శాఖ వర్గాలు భరోసా కల్పిస్తున్నాయి. మరోవైపు ఇంటర్నేషనల్ మార్కెట్లో చమురు కూడా కంట్రోల్‌లోనే ఉంది. వర్షపాతం కూడా సాధారణంగానే ఉండొచ్చని వాతావరణ శాఖ ఇప్పటికే ఓ అంచనాకు వచ్చింది. ఇలా వివిధ ఫ్యాక్టర్స్ వడ్డీ రేట్ల తగ్గింపునకే ఎక్కువగా ఆస్కారాన్ని కలిపిస్తున్నాయి. అందుకే ఈ సారి మానిటరీ పాలసీ కమిటీపై ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు జనాలు, కార్పొరేట్లు.

RBI may make it three cuts in a row to boost growth

అర శాతం వడ్డీ రేట్ తగ్గిస్తారా ?

ఇంకొంత మంది మాత్రం కాస్త అత్యాశగా ఉన్నారు. పావు శాతం వల్ల పెద్దగా ప్రయోజనం లేదని కనీసం అర శాతం వడ్డీ రేట్లను తగ్గిస్తేనే ప్రయోజనం ఉంటుందనే అభిప్రాయంతో ఉన్నారు. ఎందుకంటే పదికి, పావుకి బ్యాంకులు పెద్దగా చలించట్లేదు. ఆర్బీఐకి రేట్లకు అనుగుణంగా వాళ్లు ఇంట్రెస్ట్ రేట్లను దించడం లేదు. అందుకే ఈ సారి ఆర్బీఐ బిగ్ స్టెప్ తీసుకుంటే వాళ్లు కూడా తప్పక ఫాలో కావాల్సి వస్తుందనే అంచనాతో ఉన్నారు. ఇప్పుడు రెపో రేట్ 6 శాతం, రివర్స్ రెపో రేట్ 5.75 శాతం, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ 6.25 శాతంగా ఉంది. ఒక వేళ ఆర్బీఐ అంత ఆవేశంగా అర శాతం వడ్డీ తగ్గిస్తే మాత్రం నిజంగా అప్పులు తీసుకున్న వాళ్లకు పండుగే. ఎందుకంటే హౌసింగ్, వెహికల్, పర్సనల్ లోన్స్ తీసుకున్న వాళ్ల ఈఎంఐలు బాగా తగ్గుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+