రష్యా చైనాల మధ్య ఒప్పందం: రష్యాలో 5జీ నెట్‌వర్క్ అభివృద్ధి చేయనున్న హువాయ్

మాస్కో: అమెరికాలో భద్రతా పరంగా ముప్పు ఉందని అంచనా వేస్తున్న ప్రముఖ చైనా మొమైల్ తయారీ సంస్థ హువాయ్... రష్యాలో 5జీ సేవలను అభివృద్ధి చేసేందుకు గాను రష్యా టెలికాం సంస్థ ఎంటీఎస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. మాస్కోలో సమావేశమైన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమక్షంలో ఈ ఒప్పందం రెండు కంపెనీలు కుదుర్చుకున్నాయి.

2019-20 నాటికల్లా యుద్ధ ప్రాతిపదికన 5జీ అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేస్తామని రష్యా టెలికాం సంస్థ ఎంటీఎస్ వెల్లడించింది. రష్యా చైనా దేశాల వ్యూహాత్మక బంధం ఈ ఒప్పందంతో మరింత బలపడిందని తనకు చాలా సంతోషంగా ఉందని అన్నారు హువాయ్ అధినేత గువోపింగ్. చైనాకు చెందిన ఈ ప్రముఖ హువాయ్ కంపెనీ గత మే నుంచి ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. ఇందుకు కారణం అమెరికా టెక్నాలజీని ఇతర దేశాలకు అమ్మడంపై ట్రంప్ సర్కార్ నిషేధం విధించడమే. ఇలా అమెరికా టెక్నాలజీ వినియోగించి తమ దేశంపైనే గూఢచర్యంకు కొన్ని దేశాలు దిగుతున్నాయన్న అనుమానం రావడంతో ట్రంప్ అమెరికాలో తయారయ్యే టెక్నాలజీని ఇతర దేశాలకు విక్రయించరాదనే నిర్ణయం తీసుకున్నారు.

Huwaei and MTS sign deal, China company to develop 5G network in Russia

ఇక మూడునెలల్లో ట్రంప్ నిర్ణయం అమల్లోకి రానున్న నేపథ్యంలో అమెరికాలోని హువాయ్ కంపెనీ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. తమ ఫోన్ల తయారీకి అమెరికా ఉత్పత్తి చేసే చిప్స్‌నే వాడుతున్నారు. ఇప్పటికే హువాయ్ సంస్థ నుంచి చాలా కంపెనీలు దూరంగా వెళ్లిపోయాయి. ఇందులో గూగుల్ కంపెనీ అతిపెద్దది. ఇక బ్రిటన్‌లో కూడా తన సేవలను విస్తరించాలని భావించింది హువాయ్ కంపెనీ. అయితే బ్రిటన్‌లో నెలకొన్న రాజకీయ అనిశ్చితి కారణంగా దానిపై థెరిసా మే ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+