అమరావతి: ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వం ఆశా వర్కర్లకు రెండు రోజుల క్రితం గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా ఆశా వర్కర్లు మంచి వేతనాల కోసం డిమాండ్ చేస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వారికి అనూహ్యంగా రూ.3వేల నుంచి రూ.10,000కు వేతనం పెంచింది. సోమవారం క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన వైద్య ఆరోగ్య శాఖ సమీక్ష సమావేశంలో జగన్ ఆశా కార్యకర్తల వేతనాలు పెంచుతున్నట్లు ప్రకటించారు. దీంతో 42 వేల మందికి పైగా కార్యకర్తలు ప్రయోజనం పొందనున్నారు.

జగన్ ప్రభుత్వంపై మూడింతలు భారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 42వేలకు పైగా కార్యకర్తలు ఉన్నారు. ఈ పెంపుతో వారు ప్రయోజనం పొందనున్నారు. ఇక నుంచి వారికి ఇచ్చే వేతనాలు మూడు రెట్లకు పైగా పెరగనున్నాయి. ఉదాహరణకు 42 వేల మంది ఆశా వర్కర్లు ఉంటే మూడువేల రూపాయల చొప్పున వారికి దాదాపు 13 కోట్ల నిధులు అవసరమయ్యాయి. ఇక నుంచి ఈ నిధులు మూడింతలు పెరగనున్నాయి. అంటే 40 కోట్లకు పైగా నిధులు అవసరం. తాజా నిర్ణయంతో ప్రభుత్వానికి మూడింతలకు పైగా భారంపడ్డ నిర్ణయం తీసుకున్నారు.

ఒక్కొక్కరికి రూ.7వేలు అదనం
ఏపీ అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆశా వర్కర్ల వేతనాలపై నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు, అప్పుడు ప్రతిపక్ష నేతగా.. ఇప్పుడు సీఎంగా ఉన్న జగన్ పోటాపోటీ హామీలు ఇచ్చారు. రూ.3వేల వేతనాన్ని రూ.8వేలు చేస్తానని చంద్రబాబు చెప్పగా, రూ.10వేలు చేస్తానని జగన్ చెప్పారు. గతంలో రూ.3వేలు ఉండగా ఇప్పుడు పదివేలకు పెంచడం ద్వారా ఒక్కొక్కరికి రూ.7వేలు అదనంగా ఇస్తుంది ఈ ప్రభుత్వం. అంటే 300 శాతానికి పైగా పెంచినట్లు లెక్క.

ఆశా వర్కర్లు ఏం చేస్తారు?
గ్రామాల్లో ఆరోగ్య ఉపకేంద్రాల పరిధిలో ప్రతి వెయ్యి మందికి ఒక ఆశా వర్కర్ ఉంటారు. వైద్య, ఆరోగ్య సేవల్లో సహాయపడినందుకు గాను ఆశా వర్కర్లకు పనిని బట్టి పారితోషికాన్ని ఇస్తున్నారు. ఇప్పటి వరకు వీరికి నెలకు రూ.3వేల గౌరవ వేతనం, వివిధ సేవల్లో సహాయపడినందుకు సుమారు మరో రూ.3వేలు అందాయి. ఇప్పుడు వారి ఫిక్స్‌డ్ వేతనాన్ని మూడు రెట్లకు పైగా పెంచారు. నేషనల్ రూరల్ హెల్త్ మిషన్‌లో ఆశా వర్కర్లు కీలకం. గ్రామస్థాయిలో వెయ్యి మంది జనాభాకు ఒక ఆశా వర్కర్ లెక్కన 2006లో ఆయా గ్రామాల్లో అవుట్ సోర్సింగ్ రూపంలో నియమించారు. వీరు ఆయా గ్రామాల్లో ఆరోగ్యపరంగా ప్రజలకు సూచనలు చేస్తారు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications