న్యూఢిల్లీ: సాధారణంగా ప్రతి ఏడాది జూలై 31వ తేదీలోపు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈసారి (2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను) సీబీడీటీ ఫాం 16 ఇష్యూ తేదీని పెంచడంతో పాటు ఐటీఆర్ ఫైలింగ్ తేదీని కూడా పొడిగించనుంది.
ఇప్పటికే ఎంప్లాయర్ (యజమాని/కంపెనీ)ఇవ్వాల్సిన ఫాం తేదీని పొడిగించింది. ఈ మేరకు సీబీడీటీ 4 మే 2019న ఆదేశాలు జారీ చేసింది. టీడీఎస్ రిటర్న్స్ (ఫాం24క్యూ) తేదీని 31 మే 2019 నుంచి 30 జూన్ 2019 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే ఫాం 16 డ్యూ డేట్ను కూడా 15 జూన్ 2019 నుంచి 10 జూలై 2019కి పెంచారు.

ఇంతకుముందు ఫాం 24క్యూ ఫైల్ చేయాల్సిన చివరి తేదీ మే 31. ఇప్పుడు దీనిని జూన్ 30వ తేదీ వరకు పొడిగించారు. ఇంతకుముందు ఈ మినహాయింపు ఒడిశాకు ఇచ్చారు. ఇప్పుడు దేశమంతటికీ వర్తిస్తుంది.
అదే సమయంలో ఎంప్లాయర్స్ (యజమాని) తమ ఉద్యోగులకు ప్రొవైడ్ చేయాల్సిన ఫాం 16 తేదీని జూన్ 15వ తేదీ నుంచి జూలై 10వ తేదీకి పొడిగించింది. దీంతో ఇండివిడ్యువల్స్ ఫాం 16 ఫైలింగ్ తేదిని కూడా పొడిగించే అవకాశముంది.
ఎంప్లాయర్ జూలై 10వ తేదీన ఫాం 16 ఇస్తే కనుక ఐటీఆర్ ఫైల్ చేసేందుకు ఉద్యోగులకు తక్కువ సమయం ఉంటుంది. జూలై 31వ తేదీలోపు ఫైల్ చేయాలంటే.... కేవలం 21 రోజులు మాత్రమే మిగిలి ఉంటుంది. కాబట్టి పొడిగించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.
More From GoodReturns

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?



Click it and Unblock the Notifications