పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్)ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఆఫర్ చేస్తోంది. రిటైర్మెంట్ ప్లానింగ్ ప్రోగ్రామే పీపీఎఫ్ అకౌంట్. ఈ అకౌంట్ ద్వారా ఇన్‌కం ట్యాక్స్ బెనిఫిట్స్, ప్రణాళికాబద్ద పెట్టుబడితో మంచి రిటర్స్ ఉంటాయి. ఎస్బీఐలో ఇండివిడ్యువల్స్ లేదా మైనర్ పేరిట పీపీఎఫ్ అకౌంట్ తెరవవచ్చు. పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేయడానికి నిబంధనలు ఉన్నాయి.

పెట్టుబడి లిమిట్
ఏడాదికి కనీసం రూ.500 నుంచి గరిష్టంగా రూ.1,50,000 వరకు పీపీఎఫ్ అకౌంట్‌లో డిపాజిట్ చేయవచ్చు. ఖాతాదారు సంవత్సరానికి లక్షన్నరకు మించి డిపాజిట్ చేయరాదు. ఒకవేళ సంవత్సరానికి గరిష్ట పరిమితికి మించి డిపాజిట్ చేస్తే ఆ మొత్తంపై వడ్డీ రాదు. అలాగే ఆ మొత్తానికి ఆదాయపన్ను పరిమితి కూడా వర్తించదు. మొత్తాన్ని మీరు ఏడాదిలో ఒకేసారి చెల్లించవచ్చు లేదా నెలకోసారి ఇన్‌స్టాల్‌మెంట్ చొప్పున చెల్లించవచ్చు.

వడ్డీ రేటు
కేంద్ర ప్రభుత్వం మూడు నెలలకు ఓసారి వడ్డీ రేట్లను సవరిస్తుంది. ఆ వడ్డీ రేట్లను ఎస్బీఐ వర్తింప చేస్తుంది. ప్రస్తుతం ఈ వడ్డీ రేటు ఏడాదికి 8.0 శాతంగా ఉంది. వడ్డీని ప్రతి నెల 5వ తేదీ నుంచి లెక్కిస్తారు. దీనిని ప్రతి ఏడాది మార్చి 31వ తేదీన చెల్లిస్తారు.

మెచ్యూరిటీ పీరియడ్
మెచ్యూరిటీ పీరియడ్ 15 ఏళ్లుగా ఉంది. అయితే అప్లికెంట్ ఆ తర్వాత దీనిని మరో ఏడాది నుంచి 5 ఏళ్ల వరకు పెంచుకోవచ్చు. ఎస్బీఐ పీపీఎఫ్ అకౌంట్‌కు ఆదాయపన్ను చట్టం సెక్షన్ 88 కింద ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయి. వడ్డీ సహా మొత్తంపై ఆదాయ పన్ను పరిమితి వర్తిస్తుంది. ఎస్బీఐ పీపీఎఫ్ అకౌంట్ మొత్తాన్ని అయిదేళ్ల పీరియడ్ తర్వాత షరతుల కింద మాత్రమే తీసుకునే వెసులుబాటు ఉంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications