భారత ఔషధ దిగుమతులపై చైనాలో నియంత్రణ మార్పులు క్రమబద్దీకరించిన నేపథ్యంలో రాబోవు రోజుల్లో డెబ్బై ఉత్పత్తులను విడుదల చేసేందుకు డాక్టర్ రెడ్డీస్ లేబరేటరీస్ సిద్ధమవుతోంది. చైనా మార్కెట్ పన డాక్టర్ రెడ్డీస్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. అమెరికా నియంత్రణ మండలి కట్టుదిట్టమైన చర్యలు, యూరప్ మార్కెట్లో పోటీ తీవ్రం కావడంతో రెడ్డీస్.. చైనాపై దృష్టి సారించింది.
చైనా మార్కెట్లోకి డెబ్బై రకాల మందులను విడుదల చేసేందుకు సిద్ధమని ప్రకటించింది. అక్కడి ఫార్మా రంగంలోని అవకాశాల్ని అందిపుచ్చుకునేందుకు రెడ్డీస్ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోంది. చైనాలో కొత్త ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతోంది. ఈ కొత్త ప్లాంట్ ఏర్పాటు చేయాలా లేక పాత యూనిట్‌ను కొనుగోలు చేయాలా అనేది స్పష్టత రాలేదు. అయితే, చైనాలో ఇప్పుడున్న ప్లాంటుకు దగ్గరలోనే మరో నూతన ప్లాంటు నిర్మాణానికీ సన్నాహాలు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది.

చైనా అధికారుల నుంచి అవసరమైన అనుమతులు పొందే అంశంపై దృష్టి సారించామని, కేన్సర్ సంబంధింత (ఆంకాలజీ) ఔషధాలతో పాటు మరిన్ని ఔషధాలను అక్కడ విక్రయించేందుకు సన్నద్ధమవుతున్నామని, చైనాను ఒక ముఖ్యమైన విపణిగా భావిస్తున్నామని, ఔషధ ఉత్పత్తులకు సంబంధించి నియంత్రణ మార్పులు చేయడానికి ఆ దేశం ముందుకొచ్చిన నేపథ్యంలో రాబోయే కొన్నేళ్లలో సుమారు డెబ్బై రకాల ఉత్పత్తులను అక్కడ విడుదల చేసేందుకు ప్రణాళిక రచిస్తున్నామని రెడ్డీస్ లాబరేటరీస్ చెబుతోంది. ఔషధాలను విడుదల చేసేందుకు చైనా నియంత్రణ మండలి అనుమతి కోసం చూస్తున్నామని తెలిపారు.
ఔషధాల దిగుమతిపై గతంలో ఉన్న నిబంధనల్ని అక్కడి ప్రభుత్వం మార్చిందని, దీంతో నాణ్యమైన, చౌక ధర కలిగిన ఔషధాల్ని విక్రయించడానికి లైన్ క్లియర్ అయిందన్నారు. ఇప్పటికే అమెరికా మార్కెట్లో విక్రయిస్తున్న 70 రకాల మందుల్ని గుర్తించామని, వీటికి అక్కడి మార్కెట్లో డిమాండ్ ఉంటుందన్నారు.
More From GoodReturns

అమెరికాకు చైనా బిగ్ షాక్.. ఇరాన్‌కు రహస్యంగా నిధులు.. హార్ముజ్ జలసంధి నుంచి నిరంతరంగా చమురు సరఫరా..

ఇరాన్ యుద్ధం.. ఎరువుల కొరతతో సంక్షోభంలోకి వ్యవసాయ రంగం..ప్రత్యామ్నాయ మార్గాలు వైపు కేంద్రం అడుగులు..

రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు.. అందువల్లే అనుమతి ఇచ్చామని తెలిపిన అమెరికా..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

బంగారం ధరలు ఈ రోజు కూడా ఢమాల్..ఇంకా తగ్గేదాకా వెయిట్ చేయండి.. మార్చి 14, శనివారం ధరలు ఇవే..

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!

Bengaluru: గ్యాస్ సిలిండర్ లేకుండా ఈ దంపతులు ఎలా జీవిస్తున్నారో చూడండి!

Bengaluru: బెంగళూరు టూ హైదరాబాద్ బుల్లెట్ రైలు.. ఇక విమాన వేగంతో ప్రయాణం!

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..



Click it and Unblock the Notifications