పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు చెందిన రూ.14వేల కోట్ల స్కాంలో సూత్రధారుల్లో ఒకరైనా నీరవ్ మోడీ శుక్రవారం బెయిల్ కోసం యూకే హైకోర్టును ఆశ్రయించాడు. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పైన న్యాయస్థానం జూన్ 11వ తేదీన విచారణ చేపట్టే అవకాశముంది. నీరవ్ మోడీకి జూన్ 27వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ యూకే కోర్టు గురువారం (మే 30) ఆదేశాలు జారీ చేసింది. అలాగే, ఆయనను ఏ జైళ్లో పెడతారో చెప్పాలని భారత ప్రభుత్వాన్ని అడిగింది.
నీరవ్ మోడీని అప్పగించితే ఏ జైళ్లో పెడుతారో చెప్పాలని భారత్‌ను లండన్ వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ న్యాయస్థానం నిన్న ప్రశ్నంచింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కాం ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్ మోడీ లండన్‌లో పట్టుబడ్డాడు. ఈ కేసును వెస్ట్ మినిస్టర్ కోర్టు విచారిస్తోంది.

ఇందులో భాగంగా అతనిని అప్పగిస్తే ఏ జైళ్లో పెడతారో చెప్పాలని అడిగింది. రెండు వారాల్లో తెలిజేయాలని చీఫ్ మేజిస్ట్రేట్... భారత ప్రభుత్వానికి సూచించింది. ఈ క్రమంలోనే వచ్చే నెల 27దాకా ఈ కేసు విచారణను వాయిదా వేసింది. అప్పటి వరకు నీరవ్ రిమాండ్‌కు ఆదేశించింది.
గత ఏడాది డిసెంబర్ నెలలో విజయ్ మాల్యాను ఆర్దర్ జైళ్లో ఉంచుతామని ప్రకటించినట్లుగానే నీరవ్ మోడీని కూడా అదే జైళ్లో ఉంచితే తమకు ఎలాంటి అభ్యంతరాలు ఉండకపోవచ్చని మెజిస్ట్రేట్ తెలిపారు. నీరవ్ తరపు లాయర్ క్లేర్ మాంట్‌గోమరీ కూడా మాల్యాను ఉంచిన జైళ్లోనే ఉంచితే తమకు ఎలాంటి అభ్యంతరం ఉండదన్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications