ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో ఉద్యోగులకు షాకిచ్చింది. వేలాది మంది ఉద్యోగులను తొలగించింది. 2016లో రిలయన్స్ జియో వచ్చింది. తక్కువ మొత్తానికే డేటా, వాయిస్ కాల్స్ ఇచ్చి మిగతా టెలికం ప్రొవైడర్లకు కొరకురాని కొయ్యగా మారింది. మూడేళ్లలోనే జియో 30 కోట్ల యూజర్లకు చేరుకుంది. ఇలాంటి జియో ఉద్యోగులకు షాకిచ్చింది.

5 వేల మంది ఉద్యోగుల తొలగింపు
ఖర్చులు తగ్గించుకునే ఉద్దేశ్యంలో భాగంగా దాదాపు 5వేల మంది ఉద్యోగులను తొలగించినట్లుగా తెలుస్తోంది. నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు లాభాలను పెంచుకునేందుకు జనవరి-మార్చి మధ్యకాలంలో సంస్థ వేలమంది కాంట్రాక్ట్ సిబ్బందిని తొలగించిందట. ప్రస్తుతం రిలయన్స్ జియోలో 50 వేలమంది విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో పది శాతం అంటే 5 వేలమందిని ఉద్యోగం నుంచి తొలగించింది.

జియో పింక్ స్లిప్స్
సప్లై చైన్, హెచ్ఆర్, ఫైనాన్స్, అడ్మినిస్ట్రేషన్, నెట్ వర్క్స్ విభాగాల్లోని ఉద్యోగులకు రిలయన్స్ జియో పింక్ స్లిప్స్ ఇచ్చింది. గత రెండేళ్లలో నిర్వహణ మార్జిన్లలో పెద్దగా పురోగతి లేకపోవడంతో ఉద్యోగులను తొలగించినట్లుగా తెలుస్తోంది. గడిచిన ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రిలయన్స్ జియో 126.2 కోట్ల లాభాన్ని గడించింది. అంతకుముందు క్వార్టర్‌లో రూ.131.7 కోట్లు గడించింది. అంటే యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ (ARPU) తగ్గింది.

నిర్వహణ వ్యయం
గత ఏడాది చివరి క్వార్టర్‌లో కంపెనీ 5 బేసిక్ పాయింట్స్ తగ్గి, 39 శాతంగా ఉంది. ఆ క్వార్టర్లో 8 శాతం ఖర్చులు పెరిగాయి. నెట్ వర్క్ నిర్వహణ వ్యయం, ఆర్థిక నిర్వహణ (ఖర్చులు) పెరగడంతో పాటు లాభం తగ్గింది. దీంతో ఉద్యోగులను క్రమంగా తొలగించిందని తెలుస్తోంది. రిలయన్స్ జియోకు 30.7 కోట్ల కస్టమర్లు ఉన్నారు. యూజర్ బేస్ ప్రకారం 26 శాతం మార్కెట్ షేర్ కలిగి ఉంది. రెవెన్యూ మార్కెట్ షేర్ 31 శాతంగా ఉంది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications