తమ ప్యాంట్రీ సేవలను భారత్‌లోని 110 నగరాలకు విస్తరించనున్నట్లు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ గురువారం ప్రకటించింది. గ్రాసరీ కేటగిరీలో తమ వ్యాపారాన్ని మరింత పెంచుకునేందుకు ఇది అమెజాన్‌కు ఉపయోగపడనుంది. భారత్‌లో మరింత వేగంగా విస్తరించేందుకు ఇది ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే ప్యాంట్రీ సేవలను వందకు పైగా పట్టణాలకు విస్తరించేందుకు సిద్ధమైంది.
అమెజాన్ ప్యాంట్రీ దేశంలో వేగంగా విస్తరిస్తోంది. గత ఏడాది నవంబర్ నాటికి దేశంలోని 40 పట్టణాలకు ఈ సర్వీసులు ఇప్పుడు నూటా పది పట్టణాలకు విస్తరించనుంది.

అమెజాన్‌లో గ్రాసరీ మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఈ విభాగంలో అమెజాన్ ప్యాంట్రీ పేరుతో వినియోగదారులకు దగ్గరయ్యామని, గత ఆరు ఏడు నెలలుగా మరో 70 పట్టణాలను తమ ప్యాంట్రీ జాబితాలో చేరుస్తున్నామని, దీనిని 110కి చేర్చాలనేది తమ లక్ష్యమని అమెజాన్ ఇండియా కేటగిరీ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ సౌరభ్ శ్రీవాస్తవ వెల్లడించారు.
మహారాష్ట్రలోని ఇచల్కరంజి, హర్యానాలోని కైథాల్, కర్ణాటకలోని బెల్గామ్ వంటి చిన్న పట్టణాల్లో కూడా అమెజాన్ ప్యాంట్రీ సేవల జాబితాలో స్థానం సంపాదించాయని చెప్పారు.
అమెజాన్ ప్యాంట్రీలో 500 బ్రాండ్స్‌కు చెందిన 5వేల ఉత్పత్తులను అందుబాటులో ఉంచారు. ఇందులో స్టేపుల్స్, హౌస్ హోల్డ్ సప్లైస్, పర్సనల్ కేర్ తదితరాలు ఉన్నాయి. బెంగళూరు, ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, పుణే వంటి నగరాల్లో అందుబాటులో ఉంది. ఇందులో కస్టమర్లు డెలివరీకి సంబంధించిన టైమ్ స్లాట్‌ను బుక్ చేసుకోవచ్చు.
అమెజాన్ గ్రాసరీపై దృష్టి సారించింది. ఈ విభాగంలో 500 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. ఇండియాలో గ్రాసరీ విభాగంలో ఎదిగేందుకు ఎంతో అవకాశముందని అమెజాన్ భావిస్తోంది. పాలు, బ్రెడ్ వంటి వాటిని కూడా ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేస్తున్నారు. దీంతో భారత్‌లో రానున్న కొన్నేళ్లలో గ్రాసరీలో మంచి వృద్ధి ఉంటుందని భావిస్తోంది.
ఇప్పటికే వాల్‌మార్ట్ నేతృత్వంలోని ఫ్లిప్‌కార్ట్, గ్రోఫర్స్, బిగ్ బాస్కెట్ వంటివి కూడా గ్రాసరీ విభాగంపై దృష్టి సారించాయి. మార్చి నెలలో బిగ్ బాస్కెట్ 150 మిలియన్ డాలర్ల పెట్టుబడులను తీసుకువచ్చింది. అలాగే గ్రోఫర్స్ ఈ నెల ప్రారంభంలో 200 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది.


Click it and Unblock the Notifications