అనిల్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ గ్రూప్‌కు చెందిన రిలయన్స్ బ్రాడ్‌కాస్ట్ నెట్‌వర్క్ (RBNL)లోని రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ ల్యాండ్‌లకు చెందిన వాటాను మ్యూజిక్ బ్రాడ్ కాస్ట్‍కు (MBL) చెందిన జాగరణ్ ప్రకాశన్‌కు విక్రయించనుంది. అనిల్ అంబానీ అప్పుల ఊబిలో కూరుకుపోయిన విషయం తెలిసిందే. అప్పులు తగ్గించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆయన పలు కంపెనీల్లో వాటాను విక్రయించారు. మ్యుచువల్ ఫండ్స్ వ్యాపారానికి గుడ్ బై చెప్పనున్నట్లు ఇటీవల ప్రకటించారు. తాజాగా బిగ్ ఎఫ్ఎం రేడియో పేరుతో నిర్వహిస్తున్న వ్యాపారాన్ని జాగరణ్ ప్రకాశన్‌కు విక్రయించనున్నారు.

రూ.1,050కు బిగ్ ఎఫ్ఎం కొనుగోలు
RBNL దేశవ్యాప్తంగా BIG FM పేరుతో మొత్తం 58 స్టేషన్లు ఆపరేట్ చేస్తోంది. అలాగే, MBL రేడియో సిటీ పేరుతో 39 స్టేషన్లను ఆపరేట్ చేస్తోంది. RBNLలో తొలుత 24 శాతం వాటాను MBL తీసుకోనుంది. దీని విలువ రూ.202 కోట్లు. ఆ తర్వాత రెగ్యులేటరీ అప్రూవల్స్ అనంతరం మిగతా ఈక్విటీ షేర్లను రూ.1,050కు కొనుగోలు చేయనుంది. ఈ కొనుగోలుతో అనిల్ అంబానీకి మరిన్ని అప్పులు తగ్గనున్నాయి. వ్యూహాత్మక రుణాలను తగ్గించుకోవడంలో భాగంగా ఈ వాటాలను విక్రయిస్తున్నట్లు, దీంతో కంపెనీ రుణాలు రూ.1000 కోట్లకు పైగా తగ్గే అవకాశాలు ఉన్నట్లు రిలయన్స్ క్యాపిటల్ తెలిపింది.

40 స్టేషన్లు రేడియో సిటీకి, 18 ఇతరులకు
58 బిగ్ ఎఫ్ఎం స్టేషన్లకు గాను MBL 40 స్టేషన్లను కొనుగోలు చేస్తోంది. మిగతా 18 స్టేషన్లను ఇతరులకు విక్రయించనున్నారు. ఇందుకు సంబంధించిన చర్చలు తుది దశలో ఉన్నాయని తెలుస్తోంది. ఈ డీల్‌లో 18 స్టేషన్లు మాత్రం చేర్చలేదు. ఈ స్టేషన్లకు గాను రిలయన్స్ క్యాపిటల్ రూ.150 కోట్ల వరకు ఆర్జించవచ్చు. ఈ డీల్‌తో రిలయన్స్ క్యాపిటల్ రుణభారం రూ.1,200 వరకు తగ్గనుంది. ఇందుకు సంబంధించిన లావాదేవీలు మొత్తం ఫస్ట్ క్వార్టర్‌లో పూర్తి కానుంది. రిలయన్స్ నిప్పోన్ అసెట్స్ మేనేజ్‌మెంట్ స్టేక్‌తో రూ.6,000 కోట్లు, ఇతర మోనిటైజేషన్స్ ప్లాన్స్‌తో రిలయన్స్ క్యాపిటల్ స్టేక్ విక్రయం వల్ల రూ.12,000 కోట్ల రుణభారం తగ్గుతుందని రిలయన్స్ క్యాపిటల్ సీఎఫ్ఓ అమిత్ బాప్నా తెలిపారు. అంటే 70 శాతం రుణభారం తగ్గనుంది.

ఆర్‌కామ్ నష్టం రూ.7,767 కోట్లు
ఇదిలా ఉండగా, రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) నష్టాల పరంపర కొనసాగుతోంది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో రూ.7,767 కోట్ల నష్టం చవిచూసినట్లు సోమవారం ఆ సంస్థ ప్రకటించింది. 2017-18 ఏడాది ఇదే కాలానికి నమోదైన రూ.19,776 కోట్ల నష్టంతో పోలిస్తే తగ్గింది. కంపెనీ ఆదాయం మాత్రం రూ.976 కోట్ల నుంచి రూ.1,089 కోట్లకు ఎగబాకింది.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications