మోడీ ఎఫెక్ట్, చరిత్ర సృష్టించిన మార్కెట్స్: సెన్సెక్స్ 40,000, నిఫ్టీ 12,000 పాయింట్స్
ముంబై: సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ దూసుకెళ్తోంది. బీజేపీ ఒంటరిగా 300కు పైగా స్థానాలు, మిత్రపక్షాలతో కలిసి 350కి పైగా సీట్లు గెలిచే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మార్కెట్లు కళకళలాడుతున్నాయి. మోడీ మాయతో మార్కెట్లు జోరుమీదున్నాయు. సెన్సెక్స్ తొలిసారి 40,000 మార్క్ దాటింది. నిఫ్టీ తొలిసారి 12,000 మార్క్ దాటింది.
రెండోసారి కూడా మోడీయే ప్రధాని అవుతారని ట్రెండ్స్ తేల్చడంతో మార్కెట్లు గురువారం జోరు మీదున్నాయి. అంచనాలతో నేటి ట్రేడింగ్‌ను సూచీలు రికార్డు స్థాయిలో లాభాలతో ప్రారంభించాయి. 500 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ ఆరంభించిన సెన్సెక్స్ ప్రస్తుతం దూసుకెళ్తోంది. ఉదయం 9.45 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 595 పాయింట్లు లాభపడి 39,705 వద్ద ఉంది. ఆ తర్వాత 40వేల మార్క్ దాటింది.

ఉదయం గం.9.45 నిమిషాలకు నిఫ్టీ 169 పాయింట్ల లాభంతో 11,907 వద్ద ట్రేడ్ అయ్యాయి. ఆ తర్వాత 12,000 మార్క్ దాటింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.69.44 ఉంది. ఇండస్‌ఇండ్ బ్యాంక షేర్లు దాదాపు ఐదు శాతం లాభంతో ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంకింగ్, ఆటో, ఎనర్జీ, లోహ, ఐటీ, ఫార్మా రంగాల షేర్లు రాణించాయి.


Click it and Unblock the Notifications