సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ముందంజలో ఉన్నట్లుగా ట్రెండ్స్ చెబుతున్నాయి. బీజేపీ ఒంటరిగా 300కు పైగా సీట్లు, మిత్రపక్షాలతో కలిసి 330 సీట్లకు పైగా గెలుస్తాయని చెబుతున్నాయి. ఆదివారం రోజు ఎగ్జిట్ పోల్స్ విడుదలైనప్పుడే మార్కెట్స్ దూకుడు మీద కనిపించాయి. రికార్డులు సృష్టించాయి. ఇప్పుడు ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్న కొద్దీ ట్రెండ్స్ బీజేపీ వైపు ఉండటంతో మార్కెట్లు గురువారం కూడా జోరు మీద ఉన్నాయి.
లోకసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యాయి. గంట, రెండు గంటల్లోనే బీజేపీకి క్లియర్ మెజార్టీ వస్తుందని ట్రెండ్స్ ద్వారా తెలిసింది. దీంతో మార్కెట్లు దూకుడు మీద ఉన్నాయి. స్థిరమైన ప్రభుత్వం రావాలని మార్కెట్ వర్గాలు కోరుకుంటున్నాయి.

లోకసభ ఎన్నికల్లో బీజేపీ గెలుపు నేపథ్యంలో సెన్సెక్స్ ఏకంగా 717 పాయింట్లు పెరిగి 39,827కు చేరుకుంది. సెన్సెక్స్ 40,000 మార్క్‌కు చేరువలో ఉంది. నిఫ్టీ 11,900 పాయింట్లకు చేరింది. ఇండస్ ఇండ్ బ్యాంక్, బ్యాంక్ ఆప్ బరోడా దాదాపు 6 శాతం, ఎస్బీఐ, పీఎన్‌బీ, యస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకులు 3 నుంచి 4 శాతం పెరిగాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1 శాతం పెరిగింది.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: రియల్ ఎస్టేట్‌లో మారిన లెక్కలు! బెంగళూరు, హైదరాబాద్‌లో ట్రెండ్ ఎలా ఉందంటే..



Click it and Unblock the Notifications