రిలయన్స్ జియో ఇతర టెలికం రంగ సంస్థలకు చుక్కలు చూపిస్తోంది. ఓ వైపు తన మార్కెట్ పరిధిని రోజు రోజుకు పెంచుకుంటుండగా, మరోవైపు ప్రధాన టెలికం కంపెనీలు ఎయిర్‌టెల్ వొడాఫోన్ ఐడియా తమ కస్టమర్లను కోల్పోతున్నాయి. వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్‌లు మార్చి నెలలో వరుసగా 14.5 మిలియన్ (1.51 కోట్లు), 15.1 మిలియన్ (1.45 కోట్లు) యూజర్లను కోల్పోయింది. అదే సమయంలో జియో 9.4 మిలియన్ (94 లక్షలు) యూజర్లను పెంచుకుంది. ఇది టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) డాటా.
దేశంలో వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య ఫిబ్రవరితో పోలిస్తే మార్చిలో కాస్త తగ్గింది. ఫిబ్రవరి 28 నాటికి దేశంలో 118.3 కోట్ల వైర్‌లెస్ కస్టమర్లు ఉంటే, మార్చి 31 నాటికి ఈ సంఖ్య 116.1కోట్లుగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో 65 కోట్ల మంది, గ్రామీణ ప్రాంతాల్లో 51.1కోట్ల మంది టెలికాం సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. మార్చి నెలలో వొడాఫోన్ ఐడియా 14.5 మిలియన్ ఖాతాదారులను కోల్పోవడంతో కంపెనీ మొత్తం ఖాతాదారుల సంఖ్య 39.4కోట్లకు తగ్గింది.

ఇక మార్చి నాటికి ఎయిర్‌టెల్ ఖాతాదారుల సంఖ్య 15.1 మిలియన్ ఖాతాదారులను కోల్పోవడంతో దీని సబ్‌స్క్రైబర్లు 32.5 కోట్లకు పడిపోయింది. ముఖేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియోకు మాత్రం కస్టమర్లు పెరిగారు. ఫిబ్రవరి చివరి నాటికి 29.7కోట్ల జియో ఖాతాదారులు ఉండగా, మార్చి 31 నాటికి ఆ సంఖ్య 30.6 కోట్లకు చేరుకుంది.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications