నిన్న అలా.. నేడు ఇలా: మోడీ వస్తున్నాడని తెలిసి....
ఎగ్జిట్ పోల్ ఫలితాలతో మార్కెట్‌లో జోరు కనిపిస్తోంది. నిన్నటి వరకు కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది?, బీజేపీ వైపు అందరూ మొగ్గు చూపినప్పటికీ అసలు క్లియర్ మెజార్టీ వస్తుందా? బీజేపీ-కాంగ్రెస్ కాకుండా థర్డ్ ఫ్రంట్ వస్తే ఎలా? అనే పాయింట్ మార్కెట్ వర్గాల్లో తీవ్ర అనిశ్చితిని కలిగించింది. అయితే ఎగ్జిట్ పోల్ ఫలితాలు దాదాపు అందరి అంచనాలను తలకిందులు చేశాయి. మళ్లీ మోడీయే గెలుస్తారు కానీ మెజార్టీ రాదని, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ వచ్చే అవకాశముందని, వీరిద్దరు కాకుండా మరో ఫ్రంట్ వస్తుందనే వాదనలు వినిపించాయి. ఈ ప్రభావం మార్కెట్‌పై తీవ్రంగా పడింది. కానీ ఎగ్జిట్ ఫలితాలు బీజేపీ క్లియర్ మెజార్టీతో గెలుస్తుందని తేల్చి చెప్పాయి. దీంతో మార్కెట్‌లో దూకుడు పెరిగింది.

క్లారిటీ వచ్చింది.. మార్కెట్లకు గుడ్‌న్యూస్
అమెరికా - చైనా ట్రేడ్ వార్‌కు తోడు సార్వత్రిక ఎన్నికల అనిశ్చితి నేపథ్యంలో పలు టెక్ దిగ్గజాలు తమ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌ను హోల్డ్‌లో పెట్టాయి. అలాగే దేశీయ ఈక్విటీ మార్కెట్లలోకి భారీగా పెట్టుబడులు పెట్టిన విదేశీ పెట్టుబడిదారులు మే నెలలో వేల కోట్లు వెనక్కి తరలించుకుపోయారు. వీటన్నింటికి సార్వత్రిక ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఏ ప్రభుత్వం వస్తుందనే ఆందోళనే కారణం. ఎగ్జిట్ పోల్ ఫలితాలతో దాదాపు క్లారిటీ వచ్చింది. ఇవి అటు ఇటుగా చెబితే మార్కెట్‌లో మరింత గందరగోళ పరిస్థితి ఉండేది. కానీ బీజేపీ, కాంగ్రెస్, లెఫ్ట్.. అన్ని అనుకూల సర్వేలు కూడా బీజేపీకి 300కు పైగా స్థానాలు వస్తాయని తేల్చేశాయి. దీంతో సోమవారం మార్కెట్లు భారీ లాభాల్లోకి వచ్చాయి. ఇప్పటి వరకు వేచి చూసిన టెక్ దిగ్గజాలు, పెట్టుబడులు ఉపసంహరించుకున్న వారు ఎఫ్‌పీఐలు తిరిగి రానున్నారు.

వెల్లువెత్తనున్న ఎఫ్‌పీఐలు
విదేశీ ఫోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లలో (ఎఫ్‌పీఐ) అంతకుముందు మూడు నెలలు భారీగా పెట్టుబడులు పెట్టారు. కానీ ఏ ప్రభుత్వం వస్తుందో అనే ఆందోళనతో 6వేల కోట్లకు పైగా వెనక్కి తరలించారు. స్టేబుల్ ప్రభుత్వం రావాలని కోరుకున్నారు. ఇప్పుడు అదే జరగనుంది. దీంతో ఇప్పుడు ఎఫ్‌పీఐలు జోరందుకోనున్నాయి. అమెరికా - చైనా ట్రేడ్ వార్‌కు తోడు సార్వత్రిక ఎన్నికల అనిశ్చితి కారణంగా మే 2వ తేదీ నుంచి 17 వరకు రూ.6,399 కోట్లు ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు వీటితో పాటు మరెన్ని ఎఫ్‌పీఐలు భారత్‌కు వెల్లువెత్తుతాయని భావిస్తున్నారు.

గ్లోబల్ టెక్ కంపెనీలకు గుడ్ న్యూస్
భారత్‌లో పెట్టుబడుల అంశాన్ని గ్లోబల్ టెక్ దిగ్గజాలు హోల్డ్‌లో ఉంచాయి. ఇందుకు సార్వత్రిక ఎన్నికలే కారణం. ఏ ప్రభుత్వం వస్తుంది, ఆ ప్రభుత్వం పాలసీలు ఎలా ఉంటాయో తెలుసుకున్నాకే ముందుకెళ్లాలని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఫేస్‌బుక్, టిక్‌టాక్ వంటి దిగ్గజ కంపెనీలు భావించాయి. బీజేపీ ఇప్పటికే పెట్టుబడులకు అనుకూలమనే భావన ఉంది. ఇప్పుడు మోడీకి క్లియర్ మెజార్టీ రానుందని తేలడంతో ఈ టెక్ దిగ్గజాలు గుడ్ న్యూస్. మోడీ కాకుండా ఇతరులు ఎవరైనా అధికారంలోకి వస్తే వాళ్ల పాలసీలు ఎలా ఉంటాయి, కూటమి ప్రభుత్వం ఎన్నాళ్లు ఉంటుందనే ఆందోళన ఉండేది. అయిదేళ్ల పాటు పాలించిన ఎన్డీయే పాలసీల్లో పెద్దగా మార్పులు ఉండవు. కాబట్టి ఈ కంపెనీలకు అంచనాకు వచ్చేందుకు ఓ అవకాశం ఏర్పడింది.

మార్కెట్ వర్గాలు కోరుకున్నదే జరిగింది
మార్కెట్స్, ఇన్వెస్టర్లు నరేంద్ర మోడీయే తిరిగి అధికారంలోకి రావాలని కోరుకున్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ, థర్డ్ ఫ్రంట్ కంటే మోడీ ప్రభుత్వం బెట్టర్ అని భావిస్తున్నాయి. మోడీ హయాంలో ఎన్నో సంస్కరణలు చోటు చేసుకున్నాయని, మార్కెట్‌కు అనుకూలంగా ఉందని, కాబట్టి మళ్లీ ప్రధాని కావాలని భావించాయి. మోడీ పాలన అటు మార్కెట్ వర్గాలకు, ఇటు సామాన్యులకు అనుకూలంగా ఉందని చెబుతున్నారు. ఆదివారం ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చాక సోమవారం నాడు మార్కెట్స్ భారీ లాభాల్లో ఉండటమే.. బీజేపీ రాకపై మార్కెట్ అంచనాలు వెల్లడిస్తున్నాయి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications