జైవిక్ భారత్ లోగో లేకుండానే సేంద్రీయ ఉత్పత్తులు అమ్ముకోవచ్చు : ఫుడ్ సేఫ్టీ రెగ్యులేటర్ అథారిటీ

సేంద్రీయ ఉత్పత్తులను జైవిక్ భారత్ లోగో లేకుండానే ఏప్రిల్ 2020 వరకు చిన్నతరహా రైతులు వినియోగదారులకు అమ్ముకోవచ్చని ఫుడ్ సేఫ్టీ రెగ్యులేటర్ అథారిటీ ఆఫ్ ఇండియా అనుమతిని ఇచ్చింది. ఏడాదికి రూ.12 లక్షల టర్నోవర్ ఉన్న సేంద్రీయ ఉత్పత్తుదారులకు అనుమతి ఇచ్చింది. జైవిక్ భారత్ లోగోను సేంద్రియా ఉత్పత్తులకు మాత్రమే వినియోగిస్తారు.

ఇక ఏడాదికి రూ. 50 లక్షలు టర్నోవర్ ఉన్న అగ్రిగేటర్లకు కూడా ఇది వర్తిస్తుందని వెల్లడించింది. అయితే సేంద్రియ ఉత్పత్తులు విక్రయిస్తున్న ఔట్‌‌లెట్లు ఫుడ్ సేఫ్టీ రెగ్యులేటర్ అథారిటీ ఆఫ్ ఇండియా గైడ్‌లైన్స్‌కు అనుసరిస్తూ ఉండాలి. 2017 ఆర్గానిక్ రెగ్యులేషన్ ప్రకారం వినియోగదారుడికి సేంద్రీయ ఉత్పత్తులు విక్రయించాలంటే నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ మరియు పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ సర్టిఫికేషన్ కలిగి ఉండాలి.

 FSSAI permits to sell organic produce without certification till 2020

తాజాగా ఫుడ్ సేఫ్టీ రెగ్యులేటర్ అథారిటీ ఆఫ్ ఇండియా కొన్నిటికి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. చాలా వరుకు ఈ నిబంధనలను అమలు చేస్తున్న చిన్న తరహా సేంద్రీయ ఉత్పత్తులదారులకు కాస్త నష్టం వాటిల్లుతోందని భావించి లోగో లేకుండానే విక్రయించుకోవచ్చని అనుమతి ఇచ్చింది. పీజీఎస్-ఇండియాలో సర్టిఫికేషన్‌ను మరింత సులభతరం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఫుడ్ సేఫ్టీ రెగ్యులేటర్ అథారిటీ ఆఫ్ ఇండియా తెలిపింది.

ఇదిలా ఉంటే చిన్న తరహా సేంద్రీయ ఉత్పత్తి దారులకు మినహాయింపు ఇస్తూనే ఫుడ్ సేఫ్టీ రెగ్యులేటర్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనలను ఉత్తత్తి తయారీలో ఉల్లంఘిస్తున్నారా లేదా అనేదానిపై ఓ కన్నేసి ఉంచాలని అధికారులను బోర్డు అదేశించింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+