రూ.7వేలకోట్ల పెట్టుబడితో 2,000 జాబ్స్, హైదరాబాద్‌లో మాస్టర్‌కార్డ్ కేంద్రం!

గ్లోబల్ కార్డ్ పేమెంట్స్ దిగ్గజం మాస్టర్‌కార్డ్ రానున్న అయిదేళ్లలో భారత్‌లో 1 బిలియన్ డాలర్లు (రూ.7,000 కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపింది. దీంతో భారత్‌లోని ఉద్యోగుల సంఖ్య రెండింతలు కానుందని తెలిపింది. ప్రస్తుతం 2,000గా ఉన్న ఉద్యోగులు రానున్న అయిదేళ్లలో 4,000కు చేరుకుంటుందని పేర్కొంది. ఈ విషయాన్ని గురువారం నాడు ఆ సంస్థ వెల్లడించింది.

మరో 2వేల మందికి ఉద్యోగాలు

మరో 2వేల మందికి ఉద్యోగాలు

2013లో భారత్‌లో మాస్టర్‌కార్డ్ ఉద్యోగుల సంఖ్య 29గా ఉందని, ఇప్పుడు ఆ సంఖ్య 2,000కు చేరిందని, వీరంతా హైలీ టెక్నికల్ క్వాలిఫైడ్ స్టాఫ్ అని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాస్టర్‌కార్డ్ ఉద్యోగుల్లో భారత్‌లోని ఈ రెండువేల మందిది 14 శాతమని చెప్పారు. తాము ఇలాగే పురోగతి సాధిస్తామని, రానున్న అయిదేళ్లలో ఉద్యోగుల సంఖ్య రెట్టింపు కానుందని తెలిపారు. ఇప్పటికే బిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెట్టి దాదాపు 2,000 మంది ఉద్యోగులను నియమించామని, వచ్చే అయిదేళ్లలో మరో రూ.7వేల కోట్ల పెట్టుబడితో మరో 2,000 మందిని నియమించుకొంటామని దక్షిణాసియా విభాగపు సీనియర్‌ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ కుమార్ తెలిపారు.

పుణే కేంద్రానికి మూడొంతులు ఖర్చు

పుణే కేంద్రానికి మూడొంతులు ఖర్చు

రూ.7వేల కోట్ల పెట్టుబడితే ఉద్యోగుల సంఖ్య రెండింతలు చేయడం సాధ్యమేనని చెప్పారు. ఒక బిలియన్ పెట్టుబడులతో మరో 2,000 మందికి ఉద్యోగ అవకాశాలు సులువుగా వస్తాయని బలంగా విశ్వసిస్తున్నామని చెప్పారు. గత అయిదేళ్ల కాలంలో మాస్టర్‌కార్డ్ రూ.7వేల కోట్లను భారత్‌లో ఇన్వెస్ట్ చేసింది. తాజాగా ప్రకటించిన పెట్టుబడుల్లో మూడో వంతు పుణేలో ఉంటాయని తెలిపారు. మాస్టర్‌‌కార్డ్‌తో పాటు ఇతర విదేశీ చెల్లింపు సేవలను వినియోగిస్తున్న భారతీయుల వివరాలు భారత ప్రాదేశిక పరిధిలో ఉండాలనే నిబంధనను రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) విధించింది. ఈ నేపథ్యంలో మాస్టర్‌కార్డ్‌ ఆ వివరాలను భద్రపర్చేందుకు పుణేలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. భవిష్యత్తులో రాబోయే రూ.7వేల కోట్ల పెట్టుబడుల్లో మూడొంతులు ఈ కేంద్రం అభివృద్ధికి ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.

అమెరికా వెలుపల ఇదే మొదటిసారి

అమెరికా వెలుపల ఇదే మొదటిసారి

అమెరికా వెలుపల ఇలాంటి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి అని చెప్పారు. యూఎస్ఏ తర్వాత మొదటిసారి మాస్టర్‌కార్డ్ ఇలాంటి కేంద్రం ఏర్పాటు చేయడం భారత్‌లోనే అన్నారు. ఈ కేంద్రాన్ని గత ఏడాది అక్టోబర్ నెలలో ప్రారంభించారు. మరో రూ.2వేల కోట్లను ఐడెంటిఫికేషన్, టోకెనైజేషన్, సెక్యూరిటీ, అనలటిక్స్ సపోర్ట్ వంటి వ్యాల్యూ యాడెడ్ సర్వీస్‌ల కోసం 'సర్వీస్ హబ్' నిమిత్తం ఖర్చు చేస్తామన్నారు. డిజిటల్ చెల్లింపుల జోరు పెరుగుతోందని, అన్ని చిన్న పట్టణాలు, సెమీ అర్బన్ ప్రాంతాల్లో డిజిటల్ చెల్లింపు వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారని పెర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో 2.5 కోట్ల మంది డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారని, వచ్చే రెండేళ్లలో ఇది 12.5 కోట్లకు పెరగనుందన్నారు. అలాగే, మర్చంట్ యాక్సెప్టెన్సీ పాయింట్స్ (ఎంఏపీ) సంఖ్య మరో రెండేళ్లలో 52 లక్షల నుంచి కోటికి చేరనుందని, డిజిటల్ చెల్లింపుల విభాగంలో సౌత్ కొరియా, జపాన్, యూఎస్‌లను భారత్ అధిగమించినట్లవుతుందన్నారు.

హైదరాబాద్‌లో కార్యాలయంపై సానుకూలంగా

హైదరాబాద్‌లో కార్యాలయంపై సానుకూలంగా

బెంగళూరు, గురుగావ్‌లో కొత్త కార్యాలయాలు వచ్చాయి. పుణేలో మాస్టర్‌కార్డ్ ల్యాబ్ ఆపరేషన్స్ హబ్ ఉంది. వడోదరలో ఓ టెక్నాలజీ కేంద్రం ఉంది. ఇతర నగరాలకు కూడా కార్యకలాపాలు విస్తరించనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాదులో మాస్టర్‌కార్డ్ కేంద్రం ఏర్పాటు చేసే ఆలోచన ఉందా అని ప్రశ్నించగా... సానుకూలంగా స్పందించారు. సమీప భవిష్యత్తులో కేంద్రం ఏర్పాటు చేసే అవకాశముందని తెలిపారు. అలాగే, అంకుర సంస్థల్లో పెట్టుబడులు పెడుతున్నామని, ఇందులో భాగంగా హైదరాబాదుకు చెందిన సింటిజెన్ అనే స్టార్టప్‌లో పెట్టుబడి పెట్టామన్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+