ప్రముఖ ఆర్థికవేత్త, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ త్వరలోనే మరో కీలక పదవి చేపట్టనున్నట్లు తెలుస్తోంది. మూడు శతాబ్దాల చరిత్ర కలిసిన బీఓఈ విదేశీయులకు సైతం గవర్నర్‌గా అవకాశమిస్తోంది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కొత్త గవర్నర్ రేసులో ఆయన ఉండొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మార్క్ కర్నే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ గవర్నర్‌గా ఉన్నారు. ఆయన పదవీకాలం 2020 జనవరిలో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త గవర్నర్ ఎంపికపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ రేసులో ఉన్నవారి పేర్ల లిస్టులో రఘురామ్ రాజన్ రాజన్ పేరు చేరింది.

ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్
మూడేళ్ల పాటు రిజర్వ్ బ్యాంక్ఆఫ్ ఇండియా గవర్నర్‌గా ఉన్న రఘురామ్ రాజన్‌కు అంతర్జాతీయంగా విభిన్న ఆంశాలపై పట్టుంది. ఇంటర్నేషన్ల్ మానిటరీ ఫండ్ చీఫ్ ఎకనమిస్ట్, రీసెర్చ్ డైరెక్టర్‌గా పనిచేసిన అనుభవం ఆయన సొంతం. 2008నాటి అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభాన్ని రాజన్ ముందుగానే పసిగట్టి హెచ్చరించారు. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడంలో దిట్ట అయిన ఆయన.. ముక్కు సూటిగా వ్యవహరిస్తారన్న పేరుంది.

అకడమిక్స్‌పై ఆసక్తి
ఆర్‌బీఐ గవర్నర్ పదవి నుంచి తప్పుకున్న తర్వాత అకడమిక్స్‌పై ఉన్న ఆసక్తితో ఆయన టీచింగ్ కెరీర్‌ను ఎంచుకున్నారు. ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ చికాగో స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆర్థిక రంగంలో అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు తమ అభిప్రాయాలను పంచుకుంటారు.

రాజకీయాలు ఇష్టంలేదు
ఇదిలా ఉంటే రఘురాజ్ రాజన్ భారత రాజకీయాల్లో అడుగుపెడతారన్న ఊహాగానాలు వినిపించాయి. ఎన్నికల అనంతరం యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆయనకు కీలక బాధ్యతలు అప్పగిస్తారంటూ వార్తలు వచ్చాయి. ఈ అంశంపై మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన రాజన్.. తనకు రాజకీయాలపై ఏ మాత్రం ఆసక్తిలేదని చెప్పారు. ఒకవేళ తాను పాలిటిక్స్‌లోకి ఎంటరైతే... తన భార్య తనను వదిలేస్తుందని చెప్పారు.


Click it and Unblock the Notifications