ముంబై: అనిల్ అంబానీ సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు రుణంగా డబ్బులు ఇచ్చిన రుణదాతలు ఇప్పుడు తమ డబ్బులను తిరిగి తీసుకోనున్నట్లు సమాచారం. దాదాపు రూ.90వేల కోట్లు వీరు తిరిగి పొందనున్నట్లు తెలుస్తోంది. రిలయన్స్ సంస్థ లెక్కల ప్రకారం రూ.46వేల కోట్లు ఉండగా అది దాదాపు రెట్టింపు అయ్యింది. దివాళా తీసిన కంపెనీ నుంచి ఇంత పెద్ద మొత్తంలో రుణదాతలకు డబ్బులు తిరిగి రావడం ఇదే తొలిసారి అవుతుంది.
ఇక బకాయిలు వెంటనే చెల్లించాల్సిందిగా దేశీయ బ్యాంకులతో పాటు, ప్రపంచ బ్యాంకులు, మొబైల్ ఫోన్ కంపెనీలు అనిల్ అంబానీ రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంస్థపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఇక బకాయిలన్నీ రూ.75వేల కోట్ల నుంచి రూ.90వేల కోట్ల మధ్య ఉన్నట్లు సమాచారం. ఎవరెవరికి ఎంత చెల్లించాలో అనేదానిపై అన్ని వివరాలతో కూడిన క్లెయిమ్‌లను మే 21లోగా పంపాలని రిలయన్స్ సంస్థలో తలెత్తిన సమస్యను పరిష్కరిస్తున్న ఓ కమిటీ పేర్కొంది. ఇక ఇప్పటికే అన్ని లెక్కలు లెక్కించడం జరిగిందని ఆ డబ్బులు రూ.90వేల కోట్లు దాటే అవకాశం ఉందని తెలుస్తోంది.

జాతీయ బ్యాంకులతో పాటు చైనాకు చెందిన రుణదాతలు కూడా తమ వద్ద అప్పుగా తీసుకున్న డబ్బులను వడ్డీతో సహా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఒక కంపెనీ మూతపడినప్పుడు ఇతరులకు ఇంత భారీ స్థాయిలో డబ్బులు చెల్లించడం అనేది వ్యాపార రంగంలో తొలిసారి అని బిజినెస్ అనలిస్టులు చెబుతున్నారు. ఇక రిలయన్స్ కమ్యూనికేషన్స్‌తో పాటు ఇతర సబ్సిడరీ కంపెనీల్లో చేసిన అప్పులను కూడా చెల్లించే అవకాశం ఉంది. దీంతో చెల్లించాల్సిన మొత్తం అసలు కంటే రెట్టింపు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
2016లో రిలయన్స్ జియో రంగప్రవేశం చేయడంతో అప్పటికే వెంటిలేటర్ పై ఉన్న అనిల్ అంబానీ రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంస్థ పూర్తిగా దివాళా తీసింది. దీంతో 2017లో చేసిన అప్పులు చెల్లించలేక కంపెనీ మూతపడింది. ఇక ఆ సంస్థకు చెందిన టెలిఫోన్ టవర్లు ఇతరత్ర సామగ్రిని కొనుగోలు చేయాలని రిలయన్స్ జియో భావించినప్పటికీ కొన్ని న్యాయపరమైన చిక్కులు ఉండడటంతో ఆ ఆలోచన జియో విరమించుకుంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications