టీవీ9 ఆదాయమెంత...లాభమెంత..? ఏటా ఎన్ని కోట్లు సంపాదిస్తోంది?
టీవీ9.. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్. ఓ వార్తా సంస్థే.. వార్తల్లో నిలిచిన వైనం. రవిప్రకాశ్‌ను తొలగించడం మొదలు.. అలందా మీడియా చేజిక్కించుకోవడం వరకూ అంతా హై డ్రామా మాదిరి సాగింది. అయితే తాజాగా.. టీవీ9 ఆదాయం ఎంత ఉంటుంది, రెండు భారీ గ్రూపుల కలిసి కొనేంత డబ్బు టీవీ9 సంపాదిస్తోందా, ఎన్ని లాభాలు వస్తాయి అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అందుకే ఈ ఎక్స్‌క్లూజివ్ స్టోరీ.
చదవండి: మూర్తి నుంచి కీలక ఆధారాల సేకరణ: రవిప్రకాశ్-శివాజీ అరెస్ట్‌కు రంగం??
ఇదే సందర్భంలో కేర్ రేటింగ్స్ విడుదల చేసిన వివరాల ప్రకారం వివిధ భాషల ద్వారా టీవీకి 2018లో వచ్చిన ఆదాయం రూ.200 కోట్లు. ఖర్చులన్నీ పోగా గతేడాది వచ్చిన లాభం అక్షరాలా రూ.5.86 కోట్లు మాత్రమే. ఈ స్థాయిలో కూడా లాభాలు రావడానికి ఎన్నికల నేపధ్యంలో తెలుగు, కన్నడ నుంచి వచ్చిన ఆదాయమే అయిన కేర్ రేటింగ్స్ చెబ్తోంది. రెండు భాషల్లో టీవీ9 టాప్ స్థానంలో ఉండడం కూడా ఈ సారి మరింతగా కలిసొచ్చింది. వివిధ వ్యూహాలు, ఎన్నికల వేడి నేపధ్యంలో ఆదాయం కూడా దక్షిణాది ప్రాంతాల నుంచి గణనీయంగా పెరిగింది. 2016-17లో రూ.164.44 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిన ఏబిసిఎల్.. 2017-18లో 21.18 శాతం వృద్ధితో రూ.200.08 కోట్లను సంపాదించింది. పన్ను తర్వాత లాభం 2017లో రూ.6.49 కోట్లు కాగా ఇది 2018లో రూ.9.95 కోట్లకు పెరిగింది. మార్చి 31, 2018 నాటికి సంస్థ దగ్గర ఉన్న నగదు,బ్యాంక్ నిల్వలు రూ.25.59 కోట్లు.

మంచి రేటింగ్
రుణాలు తీసుకునే ప్రతీ సంస్థకూ కేర్, ఇక్రా, బ్రిక్‌వర్క్స్ వంటి సంస్థలు రేటింగ్ ఇస్తూ ఉంటాయి. వాటి రేటింగ్ ఆధారంగానే బ్యాంకులు వడ్డీని నిర్ణయించి అప్పులు ఇస్తాయి. టీవీ9 విషయంలో తాజాగా వాళ్లు తీసుకున్న రూ.25 కోట్ల దీర్ఘకాలిక రుణానికి కేర్ రేటింగ్ సంస్థ 'BBB' స్టేబుల్ (నిలకడ) రేటింగ్ ఇచ్చింది. దీని అర్థం మెరుగైన ఆర్థిక పటిష్టత అసోసియేటెడ్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్‌కు ఉంది. పటిష్టమైన మేనేజ్మెంట్, ప్రమోటర్ల ఆర్థిక బలిమి, నైపుణ్యం కలిగిన టీమ్, తెలుగు, కన్నడ, గుజరాతీ భాషల్లో టాప్ స్థానంలో ఉండడం వంటివన్నీ కలిసొస్తున్నాయని కేర్ రేటింగ్స్ తన నివేదికలో వెల్లడించింది.
ఇక అలందా వంతు
2019 మొదటి నెలల్లో చింతలపాటి హోల్డింగ్స్, ఐల్యాబ్స్ వెంచర్స్ సంస్థలు అలందా మీడియాకు 90.54 శాతం వాటాను అమ్మి వైదొలిగాయి. సుమారు రూ.550 కోట్లతో టీవీ9 నెట్వర్క్ ఛానల్స్ అన్నింటినీ అలందా మీడియా కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఏబిసిఎల్ అనే ప్రమోటింగ్ సంస్థ టీవీ9 తెలుగు, టీవీ9 కన్నడ, టీవీ9 గుజరాతీ, బెంగాలీ, ఇంగ్లిష్, హిందీ వంటి 7 ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్‌ను ఆపరేట్ చేస్తోంది. అయితే వీటిల్లో కన్నడ, తెలుగు, గుజరాతీ మాత్రమే అధిక ఆదాయాన్ని తెచ్చిపెడ్తున్నాయి. ఈ మధ్యే హిందీ నెట్వర్క్ పై పట్టు సాధించేందుకు ఏర్పాటుచేసిన 'భారత్ వర్ష్' ఛానల్‌కు విపరీతమైన కాంపిటీషన్ ఉందని, దీని సక్సెస్ కూడా పనితీరును ప్రభావితం చేస్తుందని విశ్లేషించింది.


Click it and Unblock the Notifications