బ్యాంకు ఖాతా ఈ రోజుల్లో తప్పనిసరిగా మారిపోయింది. చాలా మందికి ఒకటి లేదా రెండు బ్యాంకుల్లో ఖాతాలు ఉండటం సాధారణంగా కనిపిస్తోంది. అయితే బ్యాంకులో ఖాతాను ప్రారంభించాలంటే సంబంధిత బ్యాంకు శాఖకు వెళ్లాల్సిందే. దీనికి కాస్త సమయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఖాతా తెరిచినా తర్వాత అందులో బ్యాంకును బట్టి కనీస నిల్వను ఉంచడం తప్పనిసరి. లేకపోతే ఆ బ్యాంకులు మనదగ్గరి నుంచి ముక్కుపిండి మరీ జరిమానాలు వసూలుచేస్తాయి. అయితే ఇలాంటి ఇబ్బందులులేకుండా మనమే సొంతంగా ఖాతాను తెరచుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నాయి పేమెంట్స్ బ్యాంకులు.

పేమెంట్ బ్యాంక్స్
ఆదిత్య బిర్లా పేమెంట్స్ బ్యాంకు, ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంకు, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు, ఫినో పెమెంట్స్ బ్యాంకు, పేటీయం పేమెంట్స్ బ్యాంకు వంటివి ప్రస్తుతం పేమెంట్స్ బ్యాంకు సేవలు అందిస్తున్నాయి. ఆర్థిక సమ్మిళితం కోసం భారత రిజర్వు బ్యాంకు పేమెంట్స్ బ్యాంకులను తీసుకువచ్చింది.
ఏంటి లాభం?
స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్ళు సులభంగా పేమెంట్స్ బ్యాంకులో సేవింగ్స్ ఖాతాను కొన్ని నిమిషాల్లోనే తెరవవచ్చు.ఈ ఖాతాలకు కనీస నిల్వ షరతు ఉండదు. ఉదాహరణకు పేటీయం, ఎయిర్ టెల్ మొబైల్ యాప్ లను డౌన్ లోడ్ చేసుకుంటే.. వాటిలో బ్యాంకు అనే ఆప్షన్ ను ఎంచుకొని అందులో అడిగిన ప్రాథమిక సమాచారాన్ని తేలియజేస్తే సరిపోతుంది.

మీ మొబైల్ నెంబరే మీ ఖాతా నెంబర్
ఇక్కడ ఒక విషయం ఏమిటంటే సాధారణంగా బ్యాంకులో ఖాతా తెరిస్తే ఏదో ఒక ఖాతా నెంబర్ ఇస్తారు. కానీ పేమెంట్స్ బ్యాంకులో అయితే మీ మొబైల్ నెంబర్ మీకు ఖాతా నెంబర్ గా ఉంటుంది. ఖాతా తెరిచినా తర్వాత డిజిటల్ రూపంలో డెబిట్ కార్డు ను ఇస్తారు. దీనిపై కార్డు నెంబరు, సీవీవీ నెంబరు ఉంటుంది. ఈ కార్డు ద్వారా ఆన్ లైన్ కొనుగోళ్లు చేయవచ్చు. పేటీఎం బ్యాంకుల మాదిరిగా ఫిజికల్ డెబిట్ క మ్ ఏటీఎం కార్డును ఇస్తోంది. సేవింగ్స్ ఖాతాపై పేటీఎం, ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంకులు ఆకర్షణీయంగా 4 శాతం వడ్డీ చెల్లిస్తున్నాయి. ఈ వడ్డీ నెలరోజులకు ఒకసారి మన ఖాతాలో పడుతుంది. ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంకు ప్రమాద బీమా సదుపాయాన్ని కల్పిస్తోంది. పేమెంట్స్ బ్యాంకు ఖాతాలో రూ. లక్ష వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ ఖాతాలో సొమ్మును ఇతరుల ఖాతాకు లేదా మొబైల్ నెంబరుకు బదిలీ చేయవచ్చు. దుకాణాల్లోనూ చెల్లింపులు చేయవచ్చు.

పేమెంట్ బ్యాంక్ లాభాలు
ఈ మధ్య కాలంలో ఆన్ లైన్ మోసాల సంఖ్య చాలా పెరిగి పోతోంది. డెబిట్ కార్డుల ద్వారా కొనుగోళ్లు చేయాలనుంటేనే భయ పడే పరిస్థితి. ఈ నేపథ్యంలో పేమెంట్స్ బ్యాంక్ ద్వారా పొందినా డెబిట్ కార్డుతో లావాదేవీలు జరపడం సురక్షితంగా ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు. మీకు ఎదైన బ్యాంకు లో ఖాతా ఉంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలోకి అవసరం ఉన్నంత మేరకు నగదు బదిలీ చేసి వినియోగించుకుంటే ప్రయోజనం ఉంటుంది కూడా...


Click it and Unblock the Notifications