సామాన్యుడికి ప్రియమైన ఆహారం కోడిగుడ్డు ధర దిగి వచ్చింది. రెండు నెలల క్రితం వరకు ఠారెత్తించిన గుడ్డు ధర భారీగా పతనమైంది. మార్చి వరకు రిటైల్ రిటైల్ మార్కెట్లలో రూ.6 పలికిన కోడిగుడ్డు ధర ఇప్పుడు రూ.4కే లభిస్తోంది. అయితే మరో నెల రోజుల్లో మళ్లీ కోడిగుడ్డు ధర రూ.5 నుంచి రూ.6కు చేరుకునే అవకాశమున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
భారతదేశంలో రోజుకు సగటున 21 కోట్ల కోడిగుడ్లు ఉత్పత్తి అవుతుండగా, అందులో రోజుకు 7 కోట్ల కోడిగుడ్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోనే ఉత్పత్తి అవుతున్నాయి. అందులో మన తెలుగు రాష్ట్రాల్లో రోజుకు 3.5 కోట్ల కోడిగుడ్లను ఆరగిస్తుండగా, మరో 3.5 కోట్ల గుడ్లను ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. అయితే ఉత్తరాది ప్రజలు ఎండాకాలంలో కోడిగుడ్లను తక్కువగా వినియోగిస్తారట.

అందుకే అక్కడ డిమాండ్ తగ్గడంతో మొత్తంగా కోడిగుడ్ల ధరలు రూ.6 నుంచి రూ.4కు పడిపోయాయి. కానీ మరో నెల రోజుల్లో వర్షాలు ప్రారంభమైతే మళ్లీ గుడ్డు ధరలు పెరుగుతాయని చెబుతున్నారు. పాఠశాలలు, తెరుచుకుంటే విద్యార్థుల వినియోగం కూడా పెరగనుంది. ఇది కూడా ఓ కారణంగా చెబుతున్నారు. కాబట్టి ధరలు అందుబాటులో ఉన్నప్పుడే వీలైనన్ని గుడ్లు తినండని పోషకాహార నిపుణులు సలహా ఇస్తున్నారు. సో... కోడిగుడ్డు తినండి... శక్తిని పెంచండి.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications