డ్యూయల్ కెమెరా, గూగుల్ అసిస్టెంట్ బటన్‌తో సరికొత్త నోకియా 4.2
నోకియా బ్రాండ్ పైన హెచ్‌ఎండీ గ్లోబల్ మరో స్మార్ట్ ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. నోకియా 4.2 పేరుతో తీసుకొచ్చిన ఈ మొబైల్ ఆండ్రాయిడ్ వన్ ప్లాట్ ఫాంపై పని చేస్తుంది. గూగుల్ అసిస్టెంట్ బటన్‌తో ఈ ఫోన్ రానుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో దీనిని పరిచయం చేసింది. HMD గ్లోబల్ రెండు వేరియంట్లలో నోకియా 4.2ను తయారు చేసింది. ప్రస్తుతం ఒక వేరియంట్‌ను తీసుకు వచ్చింది.
3GB ర్యామ్, 32GB ఇంటర్నల్ స్టోరేజీ కలిగిన ఈ మొబైల్ ధర రూ.10,999. బ్లాక్, పింక్, శాండ్ కలర్స్‌లలో ఇది లభిస్తుంది. నోకియా ఆన్‌లైన్ స్టోర్‌లలో విక్రయానికి ఉంచారు. మరికొద్ది రోజుల్లో అన్ని మొబైల్ దుకాణాల్లో అందుబాటులోకి రానుంది.

నోకియా ఆన్‌లైన్ స్టోర్ ద్వారా ప్రారంభ ఆఫర్ కింద రూ.500 కన్సెషన్ ఇస్తున్నారు. వొడాఫోన్ - ఐడియా వినియోగదారులు రూ.2,500 విలువైన రూ.50 ఓచర్లను పొందవచ్చు. ఆరు నెలల పాటు స్క్రీన్ రీప్లేస్‌మెంట్ సదుపాయం ఉంది.
5.71 అంగుళాల హెచ్‌డీ + డిస్‍ప్లే, స్నాప్ డ్రాగన్ 439 ప్రాసెసర్, 3GB ర్యామ్+ 32GB ఇంటర్నెట్ స్టోరేజ్, ఎస్డీ కార్డుతో 400 GB వరకు మెమొరీ పొడిగించుకోవచ్చు. ఆండ్రాయిడ్ 9, వెనుకవైపు 13+2 డ్యూయల్ కెమెరా సెటప్, 8 మెగా ఫిక్సల్ ఫ్రంట్ కెమెరా (సెల్ఫీ), 3000 MAH బ్యాటరీ కెపాసిటీ.


Click it and Unblock the Notifications