అక్షయ తృతీయ పర్వదినం రోజున బంగారం కొనుగోలు చేయాలని ఎంతో మంది భావిస్తారు. ఈ రోజున ఆయా బంగారం దుకాణాలు భారీ ఆఫర్లు ఇస్తాయి. తమ క్రెడిట్ లేదా డెబిట్ కార్డులతో కొనుగోలు చేస్తే క్యాష్ బ్యాక్ ఉంటుందని బ్యాంకులు ఆఫర్ చేస్తాయి. తిరుమల తిరుపతి దేవస్థానం కూడా బంగారం, వెండి డాలర్లను విక్రయిస్తుంది. అక్షయ తృతీయ సందర్భంగా కొన్ని ఆఫర్లు తెలుసుకుందాం.

శ్రీవారి డాలర్ల విక్రయం.. ధరలు
అక్షయ తృతీయ సందర్భంగా టిటిడి శ్రీవారి డాలర్లను విక్రయిస్తుంది. ఇందులో 2 నుంచి 10 గ్రాముల డాలర్లు, 5 నుంచి 10 గ్రాముల వెండి డాలర్లు, 5 నుంచి 10 గ్రాముల రాగి డాలర్లు ఉన్నాయి. 10 గ్రాముల బంగారం డాలర్ ధర రూ.32,178, 5 గ్రాముల బంగారం డాలర్ ధర రూ.16,311, 2 గ్రాముల బంగారం డాలర్ ధర రూ.6,754. 10 గ్రాముల వెండి డాలర్ ధర రూ.593, 5 గ్రాముల వెండి డాలర్ ధర రూ.320, 10 గ్రాముల రాగి డాలర్ ధర రూ.26, 5 గ్రాముల రాగి డాలర్ ధర రూ.20గా నిర్ణయించారు.

ఎస్బీఐ ఆఫర్
అక్షయ తృతీయ సందర్భంగా ఎస్బీఐ తమ బ్యాంక్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.2,500 వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటించింది. కనీసం రూ.25,000 అంతకంటే ఎక్కువ కొనుగోలుపై ఇది వర్తిస్తుంది. ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ నేడు (మే 7, అక్షయ తృతీయ) లాస్ట్. ఎస్బీఐ కార్పోరేట్ కార్డ్సు మినహాయించి అన్ని కార్డ్స్‌కు ఈ ఆఫర్ వర్తిస్తుంది. కళ్యాణ్ జ్యువెల్లర్స్ వంటి ఎంపిక చేసిన దుకాణం షాపుల్లో ఈ ఆఫర్ వర్తిస్తుంది.

హెచ్‌డీఎఫ్‌సీ ఆఫర్లు
హెచ్‌డీఎఫ్‌సీ కూడా జ్యువెల్లరీ కొనుగోలుపై 16 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ చేసింది. హెచ్‌డీఎఫ్‌సీ కార్డ్స్ కొనుగోలుపై 5X రివార్డ్స్ పాయింట్స్ ఉంటాయి. రూ.30,000 కొనుగోలుపై 5000 రివార్డ్ పాయింట్స్ ద్వారా 16 శాతం సేవ్ చేయవచ్చు. కార్పోరేట్, కమర్షియల్, బిజినెస్, వ్యాల్యూ ప్లస్ కార్డులు తప్ప మిగతా అన్ని వేరియంట్ కార్డ్స్‌కు ఈ ఆఫర్ వర్తిస్తుంది. మే 6 నుంచి 7వ తేదీ వరకు ఇది వర్తిస్తుంది. బోనస్ రివార్డు పాయింట్స్ ఆగస్టు 31వ తేదీకి రిఫ్లెక్ట్ అవుతాయి.

రిలయన్స్ ఆఫర్లు
రిలయన్స్ డిజిటల్ తమ కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. 5 గ్రాముల బంగారం, 5 శాతం క్యాష్ బ్యాక్ గెలుచుకునే అవకాశముంది. అక్షయ తృతీయ రోజున అన్ని రిలయన్స్ డిజిటల్, మైజియో స్టోర్‌లతో పాటు రిలయన్స్ వెబ్ సైట్ https://www.reliancedigital.in/ ద్వారా కొనుగోలు చేయవచ్చు. సులభ వాయిదా పద్ధతుల్లో, చౌకకు ఉత్పత్తులు సొంతం చేసుకోవచ్చు. ఇలా కొనుగోలు చేస్తే 5 గ్రాముల బంగారం, 5 శాతం క్యాష్ బ్యాక్ గెలుచుకునే అవకాశముంది.
బంగారం దుకాణాలు కూడా భారీ ఆఫర్లు ఇస్తున్నాయి. జోయ్ అలుక్కాస్ గోల్డ్ ఫార్చ్యూన్ ఆఫర్ ప్రకటించింది. ఇందులో భాగంగా బంగారం, డైమండ్ జ్యువెల్లరీ కొనుగోలుదారులకు ఉచితంగా బంగారు నాణేలు గిఫ్ట్‌గా ఇస్తారు.
రిటైల్ చైన్ ఒర్రా కస్టమర్లకు.. డైమండ్ జ్యువెల్లరీ కొనుగోలుపై 25 శాతం తగ్గింపు సదుపాయాన్ని కల్పిస్తోంది. పసిడి ఆభరణాల మేకింగ్ చార్జీలపై కూడా 25 శాతం రాయితీ ప్రకటించింది. గోల్డ్ నాణేలు, కడ్డీలపై అసలు మేకింగ్ చార్జీలు ఉండవు. డైమండ్ జ్యువెల్లరీ కొనుగోలుకు సంబంధించి వడ్డీరహిత ఇన్‌స్టాల్‌మెంట్ చెల్లింపు సౌలభ్యతను కల్పిస్తున్నట్లు తెలిపింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications