For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెల్త్‌కేర్‌పై చైనా యుద్ధం: డ్రాగన్ దేశంలోకి ఇండియన్ సన్ ఫార్మా ఎంట్రీ

|

హెల్త్‌కేర్‌పై చైనా చేస్తున్న యుద్ధాన్ని ఇండియాలోని బిగ్గెస్ట్ డ్రగ్ మేకర్ సన్ ఫార్మాస్యుటికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అందిపుచ్చుకోవాలని చూస్తోంది. హెల్త్‌కేర్ ఉత్పత్తులను తగ్గించాలని చైనా భావిస్తోంది. దీనిని సన్ ఫార్మా అదనుగా భావిస్తోంది.

చైనా మల్టీ సిటీ బల్క్ ప్రొక్యూర్మెంట్ ప్రోగ్రాంలు ప్రారంభించింది. ఔషధాల ధరల తగ్గింపుపై ప్రధానంగా దృష్టి సారించింది. ఇందులో భాగంగా భారత్ వంటి దేశాలకు చెందిన కంపెనీలకు కూడా అవకాశాలు ఇస్తున్నారు. కొత్త మెడిసిన్స్‌కు త్వరితగతిన అనుమతులు ఇవ్వడం, దిగుమతులు పెంచడం వంటివి చైనా చేస్తోంది. దీంతో సన్ ఫార్మా చైనాపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా చైనాలో ఓ వ్యాపార భాగస్వామి కోసం ప్రయత్నిస్తోంది.

రూ.300 ఇన్వెస్ట్‌తో కోటీశ్వరులు కావొచ్చు!రూ.300 ఇన్వెస్ట్‌తో కోటీశ్వరులు కావొచ్చు!

Chinas war on healthcare costs lures Indias biggest drugmaker Sun Pharma

ఇది తమకు మంచి అవకాశమని, ఇప్పటి వరకు దేశ మార్కెట్లో పెద్దగా అవకాశాలు లేనిచోట ఇప్పుడు సరికొత్త ఆదాయ వనరులు రానున్నాయని సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఫౌండర్ దిలీప్ షంఘ్వి అన్నారు. ఆయన ఓ ఇంటర్నేషనల్ పత్రిక ఇంటర్వ్యూలో చెప్పారు.

కాగా, దాదాపు 160 బిలియన్‌ డాలర్ల విలువైన చైనా ఔషధ రంగం భారతీయ కంపెనీల కోసం పలు అవకాశాలను కల్పించింది. సన్ ఫార్మా చైనాలో తమ వ్యాపారాన్ని ఆరు నుంచి తొమ్మిది నెలల సమయంలో ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.

English summary

హెల్త్‌కేర్‌పై చైనా యుద్ధం: డ్రాగన్ దేశంలోకి ఇండియన్ సన్ ఫార్మా ఎంట్రీ | China's war on healthcare costs lures India's biggest drugmaker Sun Pharma

Sun Pharmaceutical Industries Ltd. is scouting for a partner in China to help it win a larger piece of the world’s second-largest drug market, where the government is on a mission to drive down healthcare costs.
Story first published: Sunday, May 5, 2019, 17:09 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X