బిలియనీర్ హింట్: వారెన్ బఫెట్ వారసుడిగా ఇండియన్ అజిత్ జైన్? ఎవరితను?

88 ఏళ్ల బిలియనీర్ వారెన్ బఫెట్ వారసుడిగా బెర్క్‌షైర్ హాథవే పగ్గాలు ఎవరు చేపడతారనే చర్చ సాగుతోంది. ప్రస్తుతం అజిత్ జైన్, గ్రెగోరీ అబెల్ వైస్ చైర్మన్ హోదాల్లో ఉన్నారు. వీరిద్దరిలో ఒకరు పగ్గాలు చేపట్టవచ్చని భావిస్తున్నారు. ఈ మేరకు శనివారం బఫెట్ చిన్న క్లూ ఇచ్చాడు. కానీ ఎవరు తన బాధ్యతలు చేపడతారనే విషయాన్ని స్పష్టంగా చెప్పలేదు. బఫెట్ ప్రపంచంలోనే మూడో అతి ధనవంతుడు.

బఫెట్ వారసుడి రేసులో ఇండియన్ అజిత్ జైన్

బఫెట్ వారసుడి రేసులో ఇండియన్ అజిత్ జైన్

వారెన్ బఫెట్ వారసుడిగా గ్రెగరీ అబెల్ (57), అజిత్ జైన్ (67) ఫ్రంట్ రన్నర్స్‌గా ఉన్నారు. వీరిద్దరిని గత ఏడాది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లోకి తీసుకున్నారు. వీరిద్దరికి బఫెట్‌తో దశాబ్దాల అనుబంధం ఉంది. గ్రెగరీ అబెల్ 1992లో కంపెనీలో ఎనర్జీ డివిజన్‌లో జాయిన్ అయ్యారు. అజిత్ జైన్ 1986లో ఇన్సురెన్స్ డివిజన్‌లో చేరారు. బఫెట్ ఎంచుకున్న టోడ్ కాంబ్స్ (48), టెడ్ వెస్లర్ (56)లు కూడా లాంగ్ టైమ్ బిజినెస్ పార్ట్‌నర్స్‌గా ఉన్నారు. శనివారం వారసుడిపై హింట్ ఇచ్చిన బఫెట్.. సూటిగా చెప్పలేదు. గ్రెగ్, అజిత్ జైన్‌ల కంటే బెట్టర్ ఆపరేటింగ్ మేనేజర్స్ దొరకరేమో అభిప్రాయపడ్డారు. వారు అద్భుతాలు సాధించాలని ప్రశంసించారు. కాగా, అజిత్ జైన్ ఇండియన్.

బెర్క్‌షైర్‌ హాతవే వైస్‌ ఛైర్మన్‌ అజిత్ జైన్ ఖరగ్‌పూర్‌ ఐఐటీలో ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. అనంతరం హార్వార్డ్‌ వర్సిటీలో ఎంబీఏ పట్టా తీసుకున్నారు. ఐబీఎం, మెకెన్సీ అండ్‌ కోలో పనిచేశారు. అనంతరం 1986లో బెర్క్‌షైర్‌లో ఇన్సురెన్స్ విభాగంలో చేరారు. ఇప్పుడు అదే విభాగానికి ఆయన నేతృత్వం వహిస్తున్నారు. చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు అజిత్‌ దాదాపు 35 బిలియన్‌ డాలర్ల నికర లాభాన్ని సృష్టించారు. ఈ స్థాయిలో లాభాన్ని మరే ఇన్సురెన్స్ సీఈవో సృష్టించలేదు.

బెర్క్‌షైర్‌ హాతవే సీఈవోగా చేయాలంటే కంపెనీలో పదేళ్లు పని చేసిన అనుభవం ఉండాలని బఫెట్ చెప్పేవారు. జైన్‌కు ముప్పై ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జైన్‌పై వారెన్ బఫెట్‌కు విశ్వాసం. జైన్ వేగంగా మంచి నిర్ణయాలు తీసుకుంటారనే పేరు ఉంది.

వారెన్ బఫెట్ సమాధానం

వారెన్ బఫెట్ సమాధానం

కాగా, శనివారం బెర్క్‌షైర్ హాథవే కంపెనీ వార్షిక షేర్ హోల్డర్స్ సమావేశం జరిగింది. ఒమాహాలో జరిగిన సమావేశంలో పలువురు షేర్ హోల్డర్స్.. బఫెట్‌కు పలు ప్రశ్నలు సంధించారు. దానికి ఆయన సమాధానం చెప్పారు. ఆయన వేదికపై షేర్ హోల్డర్లను ఉద్దేశించి మాట్లాడారు. షేర్ హోల్డర్లు అడిగిన ప్రశ్నలకు వారెన్ బఫెట్‌తో పాటు వైస్ చైర్మన్ చార్లీ ముంగర్ కూడా సమాధానం చెప్పారు.

అమెజాన్‌లో పెట్టుబడులపై

అమెజాన్‌లో పెట్టుబడులపై

ఇటీవల అమెజాన్‌లో పెట్టుబడులు పెట్టారు. దీనిపై ఓ షేర్ హోల్డర్ ప్రశ్నించారు. అమెజాన్‌ షేర్స్ బాగా పెరిగాయని, ఇలాంటి సమయంలో ఆ షేర్ కొనడం లాభదాయకమైనా నిర్ణయమేనా అని అడగగా, దీనిపై బఫెట్ స్పందిస్తూ... ఈ నిర్ణయాన్ని తమ ఇన్వెస్టర్‌ మేనేజర్లలో ఒకరు తీసుకున్నారని చెప్పాడు. వందల కంపెనీల షేర్లను ఇన్వెస్టర్‌ మేనేజర్లు నిర్వహిస్తున్నారని, అన్ని పూర్తిగా అర్థం చేసుకునే వాళ్లు నిర్ణయాలు తీసుకుంటారని, అందువల్ల అమెజాన్‌ షేర్లు కొనడం లాభదాయకమేనని తాను భావించానని చెప్పాడు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+