అనిల్ అంబానీని వీడని కష్టాలు: ఒత్తిళ్లలో మరో సంస్థ

ప్రముఖ పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీని కష్టాలు ఇప్పుడప్పుడే వీడేలా కనిపించడంలేదు. ఇప్పటికే ఆయన కట్టాల్సిన డబ్బు ఎరిక్సన్‌కు చెల్లించకపోవడంతో సుప్రీంకోర్టు ఆయనపై సీరియస్ అయ్యింది. అయితే తన అన్న ముఖేష్ అంబానీ ఆదుకోవడంతో దాన్నుంచి బయటపడ్డారు. తాజాగా అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్‌కూడా సంకటంలో పడిపోయింది. ఐదేళ్లలో రెట్టింపు లాభాలు ఆర్జించిన ఈ కంపెనీ ఇప్పుడు నష్టాల ఊబిలో చిక్కుకుపోయింది.

మార్చి నాటికి రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ నగదు నిల్ల స్థాయి రూ.11 కోట్లకు పడిపోయింది. ఇక దీన్నుంచి గట్టెక్కేందుకు కంపెనీకి సంబంధించిన రూ.200 కోట్లు విలువైన ఆస్తులను అమ్మేందుకు అనిల్ అంబానీ కంపెనీ ప్రయత్నాలు వేగవంతం చేస్తోంది. ఇది ఎంత తర్వగా జరిగితే అంత తొందరగా కష్టాల ఊబి నుంచి గట్టెక్కే పరిస్థితి ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మార్కెట్ నుంచి సేకరించిన రుణాల్లో రూ.1760 కోట్లు బకాయిలను కంపెనీ త్వరగా తీర్చలేకపోతే రిలయన్స్ క్యాపిటల్ కంపెనీ సంక్షోభంలోకి పడిపోయే ప్రమాదం ఉందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Anil Ambani Reliance capital ltd under pressure

ఇదిలా ఉంటే అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ క్యాపిటల్ రూ.13748 కోట్లు పెట్టుబడుల రూపంలో రిలయన్స్‌కు చెందిన ఇతర గ్రూపుల్లో ఇన్వెస్ట్ చేసింది. ఇందులో నష్టాలు వచ్చిన టెలికాం కంపెనీ ,మీడియా కంపెనీల్లో కూడా పెట్టుబడులు పెట్టింది. గతేడాది సెప్టెంబరు నాటికి విక్రయించాల్సిన ఆస్తుల్లో కేవలం మూడోవంతు ఒప్పందాలను మాత్రమే పూర్తి చేయగలిగింది.నియంత్రిత షేర్‌హోల్డర్ల వాటాల్లో మూడొంతులు తనఖాలో ఉండటం కూడా ఒత్తిళ్లకు కారణమై ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+