స్నాక్స్ అండ్ బీవరేజెస్ దిగ్గజం పెప్సికో వెనక్కి తగ్గింది. రైతులపై కేసులు ఉపసంహరించుకునేందుకు సిద్ధమని తెలిపింది. రైతులకు పెద్ద ఎత్తున మద్దతు లభించడంతో షాక్ తప్పలేదు. ఇటీవల గుజరాత్‌కు చెందిన 9 మంది రైతులపై పెప్సికో కోర్టుకెక్కిన విషయం తెలిసిందే. ఇదీ తీవ్ర అలజడి రేపింది. తాము పేటెంట్ కలిగిన బంగాళాదుంపను, తమ అనుమతి లేకుండా పండించారని పెప్సికో కోర్టుకు వెళ్లింది.

వెనక్కి తీసుకుంటామన్న పెప్సికో
ఎఫ్‌సీ 5 రకానికి చెందిన బంగాళాదుంప సాగును నిలిపివేస్తేనే గుజరాత్‌కు చెందిన రైతులపై తాము పెట్టిన కేసులను వెనక్కి తీసుకుంటామన్న పెప్సికో మొదట చెప్పింది. కానీ రైతుల పోరాటం, వారికి ఎంతోమంది మద్దతు లభించడంతో ఈ దిగ్గజ కంపెనీ దిగిరాక తప్పలేదు. దేశవ్యాప్తంగా రైతుల ఆందోళనలతో ఈ విదేశీ కార్పోరేట్ సంస్థ... రైతులపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకుంటామని ప్రకటన చేసింది. పెప్సికోకు చెందిన లేస్, చిప్స్ కోసం ఎఫ్‌సీ 5 రకానికి చెందిన బంగాళదుంపలపై పేటెంట్ తీసుకుంది.

చర్చల్లో గుజరాత్ ప్రభుత్వం
ఇదే బంగాళాదుంపను రైతులు పండిస్తున్నారని పెప్సికో కేసులు పెట్టడం తీవ్ర వివాదానికి దారి తీసింది. దీనిపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాలోను పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీంతో పెప్సికో దిగి రాక తప్పలేదు. పెప్సికో 2018 ఏప్రిల్ 5వ తేదీన నలుగురు రైతులపై రూ.1 కోటి డిమాండ్ చేస్తూ కేసు వేసింది. మరో ఐదుగురిపై కూడా రూ.20 లక్షలు డిమాండ్ చేస్తూ కేసు వేసింది. ఈ వివాదంపై గుజరాత్ ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుంది. రైతు సంఘాలు, పెప్సికో మధ్య చర్చల్లో ఇన్వాల్వ్ అయింది. ప్రభుత్వంతో చర్చల అనంతరం తాము రైతులపై కేసులు ఉపసంహరించుకునేందుకు నిర్ణయించుకున్నామని పెప్సికో ఓ ప్రకటన విడుదల చేసింది.

రైతులకు పూర్తి స్వేచ్ఛ
రైతు మద్దతు సామాజిక కార్యకర్తలు మాట్లాడుతూ... సెక్షన్ 39 ప్రకారం భారతీయ రైతులు ఏ పంటను అయినా పండించుకోవచ్చునని, అమ్ముకోవచ్చునని గుర్తు చేస్తున్నారు. రైతులపై పెప్సికో తప్పుగా కేసులు వేసిందని, ఇండియన్ లీగల్ సిస్టమ్ గవర్నింగ్ అగ్రికల్చరల్ ఇన్నోవేషన్స్ రైతులకు ఏ పంట వేసేందుకైనా పూర్తి స్వేచ్ఛ ఉందని, ఇక్కడ అమెరికాలో వలె కాదని చెబుతున్నారు. కాగా, పెప్సికో ఈ రకమైన బంగాళాదుంపను 2009లో తీసుకు వచ్చింది. తక్కువ తేమ కంటెంట్ కలిగిన ఈ వెరైటీ ఆలు ప్రాసెసింగ్‌కు చాలా అనువుగా ఉంటుంది.


Click it and Unblock the Notifications