భారత్‌లో జనవరి-మార్చి పీరియడ్‌లో బంగారం డిమాండ్ 5శాతం పెరిగింది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో పెరిగిందని వరల్డ్ గోల్డ్ కౌన్సెల్(డబ్ల్యూజీసీ) తెలిపింది. 2018 తొలి క్వార్టర్లో బంగారం 151.5 టన్నులుగా ఉంది. అంతకుముందు క్వార్టర్‌తో పోల్చుకుంటే ఈ క్వార్టర్ పెరుగుదల 13 శాతం. బంగారం ధరలు ఇటీవల కాస్త తగ్గిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మార్చిలో 32,000కు పడిపోయింది. గత ఏడాది ఫస్ట్ క్వార్టర్‌లో జ్యువెల్లరీ డిమాండ్ కూడా 5 శాతం పెరిగింది.
మే 7వ తేదీన అక్షయ తృతీయ ఉంది. ఈ నేపథ్యంలో మార్చి నెలలో గోల్డ్ ఇంపోర్ట్స్ 20 శాతం వరకు పెరిగింది. మార్చి నెలలో భారత్ 196.8 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంది. అంతకుముందు ఏడాది ఇదే సమయంలో 164.4 టన్నులు దిగుమతి చేసుకుంది. అంటే 20 శాతం ఎక్కువ. పెళ్లిళ్లు, అక్షయ తృతీయ ఉండటంతో ఇంపోర్ట్స్ పెరిగాయని చెబుతున్నారు.

అక్ష తృతీయ రోజున చాలామంది బంగారం కొంటారు. దీంతో నగల వ్యాపారులు భారీ ఎత్తున ప్రకటనలు ఇచ్చి, డిస్కౌంట్లతో కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తాయి. కానీ ఆఫర్లు, ధరలు జాగ్రత్తగా గమనించి కొనుగోలు చేయాలి. దుకాణాలతో పాటు గోల్డ్ ఎక్స్‌చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్(ఈటీఎఫ్), సావరిన్ గోల్డ్ బాండ్స్(ఎస్‌జీబీ)ల్లోనూ బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. గోల్డ్ మ్యూచువల్ ఫండ్ పథకాలు తీసుకోవచ్చు.
More From GoodReturns

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!



Click it and Unblock the Notifications