SBIలో 9వేల ఉద్యోగాలు: మే 3వ తేదీలోగా దరఖాస్తు చేసుకోండి, ఇదీ ప్రాసెస్, మరిన్ని వివరాలు
ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో దాదాపు 9,000 జూనియర్ అసోసియేట్స్ నియామకానికి సిద్ధమైంది. ఆసక్తి కలిగిన వారు మే 3, 2019వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. ఎస్బీఐ 8,904 ఖాళీలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఉద్యోగులు ఏదైనా ఒక రాష్ట్రం నుంచి దరఖాస్తు చేసుకోవాలి. ఎస్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం టెస్ట్‌కు అప్పియర్ కావాలి.
అన్ని రాష్ట్రాల్లో కంటే ఉత్తర ప్రదేశ్‌లో ఎక్కువ ఖాళీలు ఉన్నాయి. యూపీలో 1,197, మహారాష్ట్రలో 780, రాజస్థాన్‌లో 600 ఖాళీలు ఉన్నాయి. తెలంగాణలో 425, ఏపీలో 253 ఖాళీలు ఉన్నాయి.
గుర్తింపు పొందిన ఏదేనీ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. వయస్సు 20 నుంచి 28 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్ల సడలింపు ఉంది. ఓబీసీ, పిడబ్ల్యూడీ అయితే వరుసగా మూడేళ్లు, పదేళ్ల సడలింపు ఉంది. ఇప్పటికే దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. మే 3వ తేదీలోపు దరఖాస్తు చేసుసోవాలి. జనరల్, ఓబీసీలు అప్లికేషన్ ఫీజుకు రూ.750, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యుడీలు రూ.125 చెల్లించాలి.

ఇలా దరఖాస్తు చేసుకోండి
- ఎస్బీఐ వెబ్ సైట్‌కు వెళ్లండి
- కొత్త యూజర్లు కచ్చితంగా Click here for New Registration పైన క్లిక్ చేయాలి.
- అక్కడి సమాచారం చదివిన తర్వాత Continue పైన క్లిక్ చేయండి.
- రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, సబ్‌మిట్ చేయండి.
- ఒక్కసారి రిజిస్టర్ అయ్యాక, ఆ రిజిస్టర్డ్ నెంబర్, పాస్‌వర్డ్‌కతో లాగిన్ అవండి.
- వివరాలు నింపండి. ఫోటోను, సిగ్నేచర్‌ను అప్ లోడ్ చేయండి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించండి. ఆ తర్వాత ఫామ్ సబ్‌మిట్ చేయండి.
- ఈ ప్రింట్ తీసుకోండి.

ఎంపిక విధానం
ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహించే ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు, అభ్యర్థులు ఎంపిక చేసుకున్న లోకల్ లాంగ్వేజ్ పైన నిర్వహించే టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ప్రిలిమ్స్ పరీక్షలో పాసైన వారిలో మెయిన్స్‌కు 1:10 పద్ధతిలో ఎంపిక చేస్తారు. మెయిన్స్‌లో సాధించిన మార్కులతో మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు.. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, చీరాల, చిత్తూరు, ఏలూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.

మరో గుడ్ న్యూస్
రానున్న కొద్ది నెలల్లో బ్యాంక్ ఆఫ్ బరోడా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలహాబాద్ బ్యాంక్‌లు కూడా రిక్రూట్‍మెంట్స్ చేసుకోనున్నాయి. పలు ఇతర బ్యాంకులు కూడా నోటిఫికేషన్ విడుదల చేశాయి. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 1,047 ఖాళీలు, ఐడీబీఐలో 950 ఖాళీలు ఉన్నాయి. ఎస్బీఐ తన పరిధిని 17 సర్కిళ్లలో విస్తరించే ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు ఉద్యోగాలు కల్పిస్తోంది. దరఖాస్తు చేసుకునేవారు ఏ రాష్ట్రం నుంచి దరఖాస్తు చేసుకుంటే అక్కడి భాషలో ప్రావీణ్యం ఉండాలి. చదవడం, రాయడం, మాట్లాడటం, అర్థం చేసుకోగలిగి ఉండాలి.


Click it and Unblock the Notifications