ఇక్కడకు Avenger రారు: ప్రయాణీకులకు ఇండియన్ రైల్వేస్ హెచ్చరిక
ఇటీవల థియేటర్లలోకి వచ్చిన 'అవేంజర్స్:ఎండ్‌గేమ్' సినిమా ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. రికార్డ్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఈ సినిమాను రాజకీయ పార్టీలు తమ ప్రచారానికి వినియోగించుకుంటున్నాయి. థియేటర్లలో భారీ మొత్తం చెల్లించి యాడ్స్ ఇస్తున్నాయి. ప్రేక్షకుల్ని కట్టిపడేస్తున్న ఈ సినిమాను ఇండియన్ రైల్వేస్ కూడా ఉపయోగించుకొని ప్రయాణీకులకు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. అవేంజర్ స్టయిల్లో ప్రయాణీలకు జాగ్రత్తలు చెబుతున్నాయి.

అవేంజర్ స్టయిల్ సేఫ్టీ హెచ్చరిక
రైలు పట్టాలు దాటే వారికి వెస్టర్న్ రైల్వేస్ అవేంజర్ స్టయిల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు వెస్టర్న్ రైల్వేస్ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసింది. 'ఇక్కడ మీ ప్రాణాన్ని కాపాడేందుకు ఏ అవేంజర్ కూడా రాబోడు. ఇక్కడ మీకు మీరే రక్షకులు. కాబట్టి భద్రంగా ఉండే మార్గాన్ని ఎంచుకోండి. దయచేసి ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను, ఎస్కలేటర్లను ఉపయోగించండి. రైల్వే ట్రాక్‌లను దాటవద్దు' అని ట్వీట్ చేసింది.

తేరా టైమ్ ఆయేగా
వెస్టర్న్ రైల్వేస్ పలుమార్లు ఎంటర్‌టైన్‌మెంట్ రూపంలోనే ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తోంది. గతంలోను గల్లీ బాయిస్ సినిమా వచ్చినప్పుడు ఇలాగే ప్రయాణీకులకు సూచన చేసింది. ఈ సినిమాలో 'అప్నా టైమ్ ఆయేగా' అనే డైలాగ్ ఉంది. దీనిని వెస్టర్న్ రైల్వేస్ ప్రయాణీకులకు సూచనగా 'తేరా టైమ్ ఆయేగా' అంటూ సూచించింది. టిక్కెట్ కొనుగోలుపై కూడా గతంలో వెరైటీగా సూచనలు చేసింది.

రైలు పట్టాలు దాటడం ప్రమాదకరం
వెస్టర్న్ రైల్వేస్ ఈ ట్వీట్ ద్వారా రైలు పట్టాలు దాడటం ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడమేననే ప్రయాణీకులకు చెబుతోంది. ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు ఉన్నప్పటికీ చాలామంది రైలు పట్టాలు దాటి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు.


Click it and Unblock the Notifications