ఇండియన్ టీచర్లకు యూఏఐ బంపరాఫర్: నెలకు రూ.3 లక్షల కంటే ఎక్కువ వేతనం
భారతీయ ఉపాధ్యాయులకు బంపరాఫర్! యూఈఏ ప్రభుత్వం ఇండియా టీచర్ల కోసం రిక్రూట్మెంట్ డ్రైవ్ ప్రారంభించింది. మన టీచర్లను ఆకట్టుకునేందుకు భారీ వేతనాలు ఆఫర్ చేస్తోంది. 3వేల టీచర్ ఖాళీలను పూరించేందుకు యూఏఈ ప్రభుత్వం వేచి చూస్తోంది. స్కిల్డ్ ఇండియన్ టీచర్లకు అవసరమైతే పది రెట్లు ఇచ్చి తీసుకునేందుకు సిద్ధమైంది. రూ.3 లక్షలకు పైగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. యూఈఏ జాతీయ ఆర్థిక వ్యవస్థను మరియు పాఠశాలల అభివృద్ధి కోసం ఇండియన్ టీచర్లపై దృష్టి సారించింది. అందుకే యూఏఈ ప్రభుత్వ స్కూల్స్‌లలో పని చేసే ఇండియన్స్‌కు పది రెట్లు ఇచ్చేందుకు సంసిద్ధంగా ఉంది.

పది రెట్ల ఆదాయం
ఈ మేరకు ముంబై, ఢిల్లీలలో నియామక ప్రక్రియ ప్రారంభిస్తోందని తెలుస్తోంది. ఇందుకు రాత పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. ఒక్కో టీచర్‌కు 16,000 దిర్హాంలు.. అంటే మన రూపాయల్లో రూ.3,04,017 ఇచ్చేందుకు సిద్ధమైంది. అంటే ఇక్కడ మన టీచర్లకు వచ్చే జీతాలకు దాదాపు పది రెట్లు. ఈ కాంట్రాక్ట్ జూలై చివరి నాటికి తుది రూపుకు వచ్చే అవకాశముందని తెలుస్తోంది. దుబాయ్‌లో ఉద్యోగం చేయాలని ఆసక్తి కలిగిన వారిని మాత్రమే ఇది ఆకర్షిస్తుందని అంటున్నారు.

ఇండియన్ టీచర్లు
యూఏఈ ప్రభుత్వం అక్కడికెళ్లే ఇండియన్ టీచర్లకు అన్ని సదుపాయాలు కల్పించేందుకు సిద్ధమవుతోంది. ఎంపికైన అభ్యర్థుల కుటుంబాల కోసం కొత్త వీసా నిబంధనలను కూడా తీసుకురావాలని చూస్తోంది. యూఏఈలో ప్రయివేటు స్కూళ్లతో ప్రభుత్వ పాఠశాలలు పోటీ పడలేకపోతున్నాయి. అందుకే అక్కడి ప్రభుత్వం పరిస్థితులను చక్కదిద్దేందుకు ఈ చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే కొత్తగా టీచర్లను నియమించే ప్రక్రియ చేపట్టింది.

ప్రయివేటు టీచర్ల వేతనాలు ఎక్కువ
యూఏఈలో ప్రయివేటు స్కూల్స్‌తో ప్రభుత్వ పాఠశాలలు పోటీ పడలేకపోతున్నాయి. అలాగే, ప్రయివేటు స్కూల్స్ టీచర్స్ కంటే ప్రభుత్వ స్కూల్స్ టీచర్స్ వేతనాలు తక్కువ. ప్రభుత్వం మాత్రం భారీ వేతనాలు ఇచ్చి ఇక్కడి నుంచి టీచర్లను తీసుకు వెళ్లాలనిభావిస్తోంది. ప్రయివేటు స్కూల్స్ 12,500 దిర్హాంలు ఆఫర్ చేస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం మన వాళ్లకు 16,000 దిర్హంలు ఆఫర్ చేస్తోంది.


Click it and Unblock the Notifications