డేటా ధరలు తగ్గడంలో రిలయన్స్ జియో పాత్ర!: డబుల్ కానున్న స్మార్ట్ ఫోన్లు
భారతదేశంలో డేటా వినియోగం, స్మార్ట్ ఫోన్ వినియోగం రోజు రోజుకు విపరీతంగా పెరుగుతోంది. 2013 నుంచి ఇప్పటి వరకు డేటా ధరలు దాదాపు 95 శాతం పడిపోయాయి. అదే విధంగా స్మార్ట్ ఫోన్ వినియోగదారులు పెరుగుతున్నారు. 2023 నాటికి ఇండియాలో ఇంటర్నెట్ వినియోగదారులు 40 శాతం పెరుగుతారని, అలాగే స్మార్ట్ ఫోన్ యూజర్లు రెండింతలు అవుతారని మెక్‌కిన్సే నివేదికలో తేలింది. ప్రధానంగా డేటా ధరలు తగ్గుదల పట్టడమే కారణమని చెబుతున్నారు.
2025 నాటికి డిజిటల్ రంగం వ్యాపారం రెండింతలు పెరుగుతుందని, 355- 435 బిలియన్ డాలర్లకు చేరుతుందని పేర్కొంది. 'డిజిటల్ ఇండియా - టెక్నాలజి టు ట్రాన్స్‌ఫార్మ్ ఎ కనెక్షన్ నేషన్' పేరిట మెక్‌కిన్సే గ్లోబల్ ఇనిస్టిట్యూట్ ఈ నివేదికను సిద్ధం చేసింది. వేగంగా పెరుగుతున్న, అలాగే అతిపెద్ద మార్కెట్ ఇండియా అని తెలిపింది. 2018 చివరి నాటికి భారత్‌లో 560 మిలియన్ల ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారని తెలిపింది.

భారత్‌లో మొబైల్ డాటా యూజర్లు నెలకు 8.3 గిగాబైట్లు (జీబీ) వినియోగిస్తున్నారని తెలిపింది. చైనాలో ఇది 5.5 జీబీగా ఉంది. అలాగే అడ్వాన్స్‌డ్ డిజిటల్ ఎకానమీ అయిన సౌత్ క1రియాలో ఇది 8 నుంచి 8.5 గిగాబైట్లు (జీబీ)గా ఉంది. మొబైల్ ఫోన్ సబ్‌స్క్రిప్షన్స్ 1.2 బిలియన్‌గా ఉంది. 2018లో మొత్తం 12.3 బిలియన్‌ల యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకున్నారు.
డిజిటలైజేషన్ వేగంగా అభివృద్ధి చెందుతున్న పదిహేడు దేశాల్లో అధ్యయనం చేయగా ఇందులో భారత్ చాలా వేగవంతంగా ఉందని తెలిపింది. డిజిటలైజేషన్‌లో ప్రభుత్వ పాత్ర ఎంతో ఉందని పేర్కొంది. రిలయన్స్ జియో పాత్ర కూడా ఉందని పేర్కొంది. జియో వచ్చాక డేటా ధరలు బాగా తగ్గిన విషయం తెలిసిందే. 2013 నుంచి పోల్చుకుంటే ఇప్పుడు డేటా ధరలు 95 శాతం తగ్గాయి.
2023 నాటికి ఇంటర్నెట్ యూజర్లు 750 మిలియన్ల నుంచి 800 మిలియన్ల మధ్య పెరుగుతారని, ఈ పెరుగుదల 40 శాతంగా ఉంటుందని, అలాగే స్మార్ట్ ఫోన్ యూజర్లు 650 మిలియన్ల నుంచి 700 మిలియన్ల వరకు పెరుగుతారని, ఇది రెండింతలు అని పేర్కొంది.


Click it and Unblock the Notifications