చైనీస్ వీడియో యాప్ టిక్‌టాక్‌కు మద్రాసు హైకోర్టులో ఊరట లభించింది. కొన్ని షరతులతో ధర్మాసనం ఈ వీడియో యాప్ పైన మధ్యంతర నిషేధాన్ని ఎత్తివేసింది. లాయర్ ముత్తుకుమార్ టిక్‌టాక్‌పై కోర్టుకు ఎక్కారు. దీంతో మధ్యంతర నిషేధం విధించింది. తాజాగా, బుధవారం కండిషన్స్‌తో అనుమతి ఇచ్చింది. పోర్నోగ్రఫీ వంటి వీడియోల్ని అప్‌లోడ్ చేయకూడదని కొన్ని షరతులు విధించింది. షరతులు పాటించడంలో వైఫల్యం చెందితే కోర్టు ధిక్కరణ కింద విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా స్పంష్టం చేసింది.
పోర్నోగ్రఫీ వీడియోల నేపథ్యంలో ఆ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోకుండా నిషేధం విధించాలని ఏప్రిల్ మూడవ తేదీన హైకోర్టు కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇదే అంశం సుప్రీం కోర్టుకు కూడా వెళ్లింది. అయితే ఇదే అంశంపై విచారణ జరుగుతుండటంతో హైకోర్టు ఆదేశాలపై స్టే విధించడానికి సుప్రీం కోర్టు అంగీకరించలేదు. ఏప్రిల్ 18 నుంచి ప్రభుత్వ ఆదేశాల మేరకు యాపిల్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్‌లో టిక్‌టాక్‌ను తొలగించాయి. ఇప్పుడు కోర్టు బ్యాన్ ఎత్తివేసింది.

తమకు భారత్‌లో 54 మిలియన్ల యాక్టివ్ యాజర్లు ఉన్నారని టిక్‌టాక్ తెలిపింది. తమ సంస్థ ఆర్థికంగా ఎంతో నష్టపోతోందని టిక్‌టాక్ ఆందోళన వ్యక్తం చేసిన విషయం కూడా తెలిసిందే. రోజుకు 5,00,000 డాలర్లు (మూడున్నర కోట్లు) నష్టపోతున్నామని, అంతేకాకుండా 250 మంది ఉద్యోగాల భవిష్యత్తు అంధకారంలో పడుతోందని పేర్కొంది. ఈ మేరకు టిక్‌టాక్ యాప్ డెవలప్ చేసిన బైట్‌డాన్స్ టెక్నాలజీస్ కంపెనీ కోర్టుకు తెలిపింది.
బుధవారం కోర్టు ఆదేశాల నేపథ్యంలో... దేశ భద్రత, అశ్లీల వీడియోలు యాప్ లోకి అప్‌లోడ్ కాకుండా చర్యలు తీసుకుంటామని టిక్‌టాక్.. హైకోర్టుకు స్పష్టం చేసింది. చైల్డ్ పోర్నోగ్రఫీని ఎంకరేజ్ చేయమని, 13 ఏళ్లలోపు చిన్నారులు యాప్ వినియోగించుకుండా చర్యలు చేపడుతామని హామీ ఇచ్చింది. దీంతో మద్రాస్ హైకోర్టు ఇదివరకు విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది. నిషేధం ఎత్తివేతతో ఇప్పుడు టిక్‌టాక్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications