For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బిల్డింగ్ టెర్రాస్‌పై స్విమ్మింగ్ పూల్ నిర్మించుకోవచ్చు, మరిన్ని నిబంధనలు మార్పు

|

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ నిబంధనల్లో మార్పులు తీసుకు వచ్చింది. ఇందులో భాగంగా భవనం టెర్రాస్ పైఅంతస్తు పైన ఈతకొలను (స్విమ్మింగ్ పూల్) నిర్మించుకోవచ్చు. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సెల్ గ్రీన్ హోమ్స్ నిబంధనల ప్రకారం గదుల వెంటిలేషన్‌కు అనుమతివ్వనున్నారు. భవనం 120 మీటర్ల ఎత్తుకు మించితే 20 మీటర్ల ఖాళీస్థలం ఉండాలి. రోడ్ల విస్తరణకు స్థలాలు ఇచ్చినవారికి ఈ వెసులుబాటు కల్పించింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) జారీ చేసిన బిల్డింగ్ కోడ్ 2016కు అనుగుణంగా ఈ మార్పులు చేశారు.

ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ జారీకి ముందే బీటీ, సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలి. ఇదివరకు ఈ సర్టిఫికేట్ వచ్చాక విద్యుత్, నీటి కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ నిబంధనలు మార్చి ముందుగానే వీటి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చాక మాత్రమే విద్యుత్, నీటి కనెక్షన్లు ఇస్తారు. నిబంధనల మేరకు టెర్రాస్ పైన స్విమ్మింగ్ పూల్‌కు అనుమతులు వస్తాయి.

నెలకు రూ.10వేలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా రూ.1కోటి సంపాదన!నెలకు రూ.10వేలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా రూ.1కోటి సంపాదన!

Telangana govt allows swimming pools on building terraces

70 మీటర్లు, అంతకంటే ఎక్కువ ఎత్తులో నిర్మించే హైరైజ్‌ బిల్డింగ్‌లు నిర్మాణాల్లో వదలాల్సిన ఖాళీ స్థలం సెట్ బ్యాక్ నిబంధనలు మార్చారు. దీని ప్రకారం 120 మీటర్లు కంటే ఎక్కువ ఎత్తులో నిర్మించే భవనాల చుట్టు 20 మీటర్ల వెడల్పు ఖాళీ స్థలం వదిలితే చాలు. గతంలో ఇంత ఎత్తులో నిర్మించే భవనాలకు 22.5 మీటర్ల స్థలం వదలిపెట్టాలనే నిబంధన ఉండేది. అప్పుడు 55 మీటర్ల ఎత్తు భవనాల వరకూ గరిష్ఠంగా చుట్టూ వదలాల్సిన ఖాళీ స్థలం 16 మీటర్లుగా ఉండగా ఆపై ప్రతి ఐదు మీటర్లకు 0.5 మీటర్ల ఖాళీ స్థలం పెరిగేది. కానీ ఇప్పుడు 120 మీటర్లు ఎత్తు దాటితే గరిష్ఠంగా 20 మీటర్ల సెట్‌బ్యాక్‌ వదిలితే చాలు.

English summary

బిల్డింగ్ టెర్రాస్‌పై స్విమ్మింగ్ పూల్ నిర్మించుకోవచ్చు, మరిన్ని నిబంధనలు మార్పు | Telangana govt allows swimming pools on building terraces

State government has notified amendments to the existing building rules to allow swimming pools on terraces and ventilation rooms and also mandating the developers to form BT/CC roads in case such roads are not in existence in the areas where residential projects are to be developed.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X