టీసీఎస్‌లో 377%, ఇన్ఫోసిస్‌లో 642% పెరిగిన హైరింగ్: ఈ ఏడాదిలో 2.5 లక్షల ఉద్యోగాలు
ఓవైపు అన్ని రంగాల్లో జాబ్ గ్రోత్ నెమ్మదించింది. మరోవైపు ఐటీ సెక్టార్‌లోని టాప్ సంస్థలు టీసీఎస్, ఇన్ఫోసిస్‌లు మాత్రం 2018-19 ఆర్థిక సంవత్సరంలో పెద్ద ఎత్తున కొత్తగా ఉద్యోగులను తీసుకుంది. టీసీఎస్ హైరింగ్ 377 శాతంగా ఉంటే, ఇన్ఫోసిస్ హైరింగ్ 642 శాతంగా ఉందట. ఫార్చూన్ రిపోర్ట్ ప్రకారం... గత ఆర్థిక సంవత్సరంలో మార్చి 31వ తేదీ వరకు టీసీఎస్ 29,287 మంది ఉద్యోగులను, ఇన్ఫోసిస్ 24,016 మంది సాఫ్టువేర్ ఉద్యోగులను చేర్చుకుంది.
మొత్తంగా ఈ రెండు కంపెనీలు గత ఆర్థిక సంవత్సరంలో 53,303 మందిని కొత్తగా తీసుకున్నారు. అదే సమయంలో 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఇవే కంపెనీలు కేవలం 11,500 మందిని మాత్రమే ఉద్యోగంలోకి తీసుకున్నారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ 7,775 మంది ఉద్యోగులను, ఇన్ఫోసిస్ 3,743 ఉద్యోగులను తీసుకుంది.

2019లో ఐటీ కంపెనీలు డాటా సైన్స్, డాటా అనాలసిస్, సొల్యూషన్ ఆర్కిటెక్టులు, ప్రాడక్ట్ మేనేజ్‌మెంట్, డిజిటల్ మార్కెటింగ్, మిషన్ లర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), బ్లాక్ చైన్, సైబర్ సెక్యూరిటీలలో ఉద్యోగులను తీసుకునే అవకాశాలు ఉన్నాయని ఐటీ నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాదిలో ఇండియన్ ఐటీ రంగంలో మరో 2.5 లక్షల ఉద్యోగాలు రానున్నాయని అంచనా వేస్తున్నారని టీంలీజ్ సర్వీస్ నివేదికలో తేలింది. 2019లో ఐటీ రీ-స్కిల్లింగ్‌లో పెట్టుబడులు 20 శాతం పెరగనున్నాయని ఈ నివేదిక తెలిపింది. ఈ నేపథ్యంలో ఐటీ సెక్టార్‌లో భారీ ఉద్యోగాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు.
గత ఏడాది కేవలం టీసీఎస్ 377 శాతం, ఇన్ఫోసిస్ 642 శాతం ఉద్యోగాలు వచ్చాయి. దాదాపు పలు పెద్ద ఐటీ కంపెనీలను పరిగణలోకి తీసుకుంటే 300 శాతం ఉద్యోగాలు పెరిగాయి. గత ఏడాది ఎక్కువ మొత్తంలో ఉద్యోగాలు రావడానికి 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఎక్కువ మందికి పింక్ స్లిప్స్ ఇవ్వడమే కారణంగా చెబుతున్నారు. అనలటిక్స్ ఇండియా మేగజైన్ స్టడీ ప్రకారం.. అనలటిక్స్ అండ్ డాటా సైన్స్ ఉద్యోగాలు 97వేలకు పైగా ఉన్నాయి. ఇందులో 97 శాతం ఫుల్ టైమ్ బేస్ అయితే, 3 శాతం పార్ట్ టైమ్.


Click it and Unblock the Notifications