For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

షాకింగ్: నీరవ్ మోడీ, ఛోక్సీలు ఇండియా నుంచి పారిపోయాక 75 శాతం తగ్గిన సిల్వర్ ఎగుమతులు

|

2018-19 ఆర్థిక సంవత్సరంలో నీరవ్ మోడీ, మెహుల్ ఛోక్సీలు భారత్ నుంచి పరారైన తర్వాత నుంచి మన దేశం నుంచి సిల్వర్ జ్యువెల్లరీ ఎగుమతులు ఏకంగా 75 శాతం తగ్గాయట. 2017-18 ఆర్థిక సంవత్సరంలో 3.4 బిలియన్ డాలర్ల సిల్వర్ జ్యువెల్లరీ ఎగుమతి అయితే గత ఏడాది మాత్రం 838 మిలియన్ డాలర్లుగా ఉంది. అంటే అంతకుముందు ఏడాదిలో పావు శాతం మాత్రమే ఎక్స్‌పోర్ట్ అయింది. నీరవ్, మెహుల్‌లు ఇండియన్ మార్కెట్ నుంచి వెళ్లిపోయాక అంటే వారు ఇక్కడి నుంచి పారిపోయాక ఇది పడిపోయింది. వీరిద్దరు 2018 ప్రారంభంలో భారత్ నుంచి పారిపోయారు. వీరు పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ.14వేల కోట్లు టోకరా పెట్టారు.

ఇది మీకు తెలుసా?: DigiLockerతో ఎంతో లాభంఇది మీకు తెలుసా?: DigiLockerతో ఎంతో లాభం

ప్రధానంగా సూరత్ స్పెషల్ ఎకనమిక్ జోన్ నుంచి ఎగుమతుల ప్రభావం పడిందని ప్రభుత్వ అధికారి ఒకరి చెప్పినట్లుగా ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఇందుకు సంబంధించి పక్కా డేటా ప్రస్తుతానికి అందుబాటులో లేదని చెప్పారట.

Silver exports fall 75% after Nirav Modi, Mehul Choksi flee India

సమాచారం మేరకు 2017-18లో సిల్వర్ జ్యువెల్లరీ 3,386 మిలియన్ డాలర్లు ఉంటే, 2018-19లో 838 మిలియన్ డాలర్లుగా ఉంది. గోల్డ్ మెడలియన్స్ అండ్ కాయిన్స్ 2017-18లో 1,971 మిలియన్ డాలర్లు ఉంటే, 2018-19లో 876 మిలియన్ డాలర్లుగా ఉంది. సిల్వర్ జ్యువెల్లరీ ఎక్స్‌పోర్ట్ 75.3 శాతం, గోల్డ్ మెడలియన్స్ అండ్ కాయిన్స్ 55.6 శాతం తగ్గింది.

గోల్డ్ జ్యువెల్లరీ 2017-18లో 9,673 మిలియన్ డాలర్లుగా ఉండగా, 2018-19లో 12,029 మిలియన్ డాలర్లుగా ఉంది. ఇది 24.4 శాతం పెరిగింది. డైమండ్స్ 2017-18లో 23,733 మిలియన్ డాలర్లుగా ఉండగా, 2018-19లో 23,817 మిలియన్ డాలర్లుగా ఉంది. గ్రాస్ ఎక్స్‌పోర్ట్స్ 2017-18లో 41,021 మిలియన్ డాలర్లుగా ఉండగా, 2018-19 నాటికి 3.3 శాతం తగ్గి 39,680గా ఉంది.

English summary

షాకింగ్: నీరవ్ మోడీ, ఛోక్సీలు ఇండియా నుంచి పారిపోయాక 75 శాతం తగ్గిన సిల్వర్ ఎగుమతులు | Silver exports fall 75% after Nirav Modi, Mehul Choksi flee India

India's silver jewellery exports nosedived 75% to $838 million in the financial year (FY) 2018-19 from nearly $3.4 billion in FY 2017-18.
Story first published: Monday, April 22, 2019, 17:29 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X