For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

3 నెలల గరిష్టానికి ద్రవ్యోల్భణం: మండుతున్న కూరగాయల ధరలు!

|

టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ - Wholesale Price Index) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్భణం మార్చి నెలలో 3.18 శాతంగా నమోదయింది. సూచీలో వస్తువుల బాస్కెట్ ధర 2018 మార్చి నెలతో పోల్చితే ఈ ఏడాది మార్చిలో హోల్‌సేల్ ధరల ద్రవ్యోల్భణం 3.18 శాతానికి పెరిగింది. గత 3 నెలల గరిష్టానికి చేరింది.. ఆహారం, ఇంధనం ఉత్పత్తుల ధరల పెరుగుదల దీనికి కారణం. సోమవారం కేంద్రం ఈ మేరకు గణాంకాలను విడుదల చేసింది.

<strong>గుడ్‌న్యూస్, SBIలో 8,900 ఉద్యోగాలు: ఇలా దరఖాస్తు చేసుకోండి</strong>గుడ్‌న్యూస్, SBIలో 8,900 ఉద్యోగాలు: ఇలా దరఖాస్తు చేసుకోండి

ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో 2.93 శాతం, జనవరిలో 2.76 శాతంగా నమోదైంది. అంతకుముందు డిసెంబర్ (2018)లో 3.46 శాతం, నవంబర్ 4.47 శాతం, అక్టోబర్ 5.22 శాతం, సెప్టెంబర్ 4.62 శాతం, ఆగస్ట్ 5.27 శాతం, జూలై 5.68 శాతం, జూన్ 4.43 శాతం, మే 3.18 శాతం, గత ఏడాది మార్చిలో 2.74 శాతంగా నమోదయింది. 2018 మార్చి నాటి టోకు ద్రవ్యోల్బణంతో పోల్చితే ఈసారి పెరిగింది.

Wholesale inflation rises to 3.18% in March as vegetable prices soar

కూరగాయల ధరలు పెరగడంతో, ఆహార పదార్థాల విభాగ ద్రవ్యోల్బణం 5.68 శాతానికి చేరుకుంది. ఇది ఫిబ్రవరిలో 4.28 శాతంగా ఉంది. కూరగాయల విభాగ ద్రవ్యోల్బణం 6.82 శాతం నుంచి ఏకంగా 28.13 శాతానికి పెరిగింది. ఆలూ ధరలు మాత్రం భారీగా తగ్గాయి. దీని ద్రవ్యోల్భణం 23.40 శాతం నుంచి 1.3 శాతానికి తగ్గింది.

పప్పు దినుసులు 10.63, గుడ్లు, మాంసం, చేపలు వంటి ప్రొటీన్‌ రిచ్‌ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 5.86, ఇంధనం, విద్యుత్‌లో 5.41 శాతం, ఉల్లిపాయ 31.34 శాతం, పండ్లు 7.62 శాతంగా ఉంది. ఇంధనం, విద్యుత్ ద్రవ్యోల్భణం 2.23 శాతం నుంచి 5.41 శాతం పెరిగింది. ముఖ్యంగా డీజిల్ 3.72 శాతం నుంచి 7.33 శాతానికి, పెట్రోల్ ప్రతి ద్రవ్యోల్భణం 2.93 శాతం నుంచి 1.78 శాతానికి పెరిగింది.

English summary

3 నెలల గరిష్టానికి ద్రవ్యోల్భణం: మండుతున్న కూరగాయల ధరలు! | Wholesale inflation rises to 3.18% in March as vegetable prices soar

Wholesale Price Index inflation stood at 3.18% for the month of March, the government said in a press release on Monday. This was higher than the 2.93% recorded in February and 2.6% in January.
Story first published: Tuesday, April 16, 2019, 10:32 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X