ఓ వైపు ఎగుమతులు, దిగుమతులు 9 శాతం పెరగగా, మరోవైపు భారత వాణిజ్యలోటు మాత్రం 2018-19 ఆర్థిక సంవత్సరానికి రికార్డ్ హైకి చేరుకుంది. ఇది 176 బిలియన్ డాలర్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం దిగుమతులు 8.99 శాతం వృద్ధితో 507.44 బి. డాలర్లకు చేరాయి. ఇక ఎగుమతులు 9.1 శాతం హెచ్చి 331.02 బి. డాలర్లకు చేరుకున్నాయి.
ఈ కారణంగా వాణిజ్య లోటు 8.9% పెరిగి 176.42 బిలియన్ డాలర్లుగా నమోదయింది. 2017-18లో వాణిజ్య లోటు 162 బిలియన్ డాలర్లు. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో వృద్ధి బాగుంది. కానీ అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా 2018-19లో ఎగుమతులు 331 బిలియన్ డాలర్లు నమోదు కావొచ్చునని అంచనా వేశారు.

భారత ఎగుమతులు మార్చి నెలలో అయిదు నెలల గరిష్ఠానికి చేరుకున్నాయి. ఔషధ, రసాయనాల, ఇంజినీరింగ్ విభాగాల్లో అధిక వృద్ధి కారణంగా అవి పదకొండు శాతం మేర పెరిగి 32.55 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అంతకుముందు ఏడాది ఇదే సమయంలో ఇవి 29.32 బిలియన్ డాలర్లుగా ఉంది. అక్టోబరు 2018లో ఎగుమతులు 17.86 శాతం మేర వృద్ధి చెందింది. ఆ తర్వాత అత్యుత్తమ వృద్ధి ఇదే కావడం గమనార్హం.
మార్చి నెలలో దిగుమతులు 1.44 శాతం పెరిగి 43.44 బిలియిన్ డాలర్లుగా ఉన్నాయి. ఎగుమతులు, దిగుమతుల మధ్య వ్యత్యాసమైన వాణిజ్య లోటు 19.4 శాతం తగ్గి 10.89 బిలియన్ డాలర్లకు చేరింది. అంతకుముందు ఏడాది మార్చిలో 13.51 బిలియన్ డాలర్లుగా ఉంది. చమురు, బంగారం దిగుమతులు వరుసగా 5.55%, 31.22% మేర పెరిగి 11.75 బిలియన్ డాలర్లు, 3.27 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
గత ఆర్థిక సంవత్సరం (2018-19) మొత్తానికి భారత ఎగుమతులు తొమ్మిది శాతం వృద్ధి చెంది 33,100 కోట్ల డాలర్లకు చేరుకుంది. 2013-4 ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు 31,440 కోట్ల డాలర్లుగా నమోదయ్యాక ఆ తర్వాత మళ్లీ ఎగుమతులకు ఇదే గరిష్ఠం.
More From GoodReturns

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications