కొత్త ఐటీ రిటర్న్స్ ఫాంలో ఈ వివరాలన్నీ ఇవ్వాల్సిందే: ఇవి తెలుసుకోండి

2019-20 అసెస్‌మెంట్ ఏడాది కోసం కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ (ఐటీఆర్) ఫారంలు వచ్చాయి. ఇందులో కొన్ని మార్పులు, చేర్పులు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో మరిన్ని వివరాలు ఇవ్వవలసి ఉంటుంది. ఎలాంటి ఎగవేతలకు ఆస్కారం లేకుండా, లూప్‌హోల్స్ అన్నింటిని తొలగించి ఈ కొత్త ఫారంలు తీసుకు వచ్చారని చెబుతున్నారు.

వ్యక్తిగత ఆదాయపన్నుదారులు తమ ఆదాయానికి సంబందించి ఐటీ రిటర్న్స్‌ను ఈ ఏడాది జూలై 31వ తేదీలోపు ఫైల్ చేయాల్సి ఉంటుంది. లేదంటే పెనాల్టీ ఉంటుంది. ఐటీఆర్ 1, ఐటీఆర్ 2లోని రివిజన్స్‌ను చదివి అర్థం చేసుకోండి. ఈ ఫారంలు ఇండివిడ్యూయల్స్‌కు, శాలరైడ్ ట్యాక్స్‌ప్లేయర్లకు అలాగే పెన్షనర్లకు. ఐటీఆర్ 1, ఐటీఆర్ 4 ఫారంలు ఇప్పటికే incometaxindiaefiling.gov.in లో అందుబాటులో ఉన్నాయి. దీంతో ఆన్‌లైన్ ద్వారా ఫైల్ చేయవచ్చు. మిగతా వారు ఇచ్చిన తేదీలోగా పూర్తి చేయాలి.

ఐటీఆర్ 1- స్టాండర్డ్ డిడక్షన్

ఐటీఆర్ 1- స్టాండర్డ్ డిడక్షన్

2018-19 కేంద్ర బడ్జెట్ సందర్భంగా పేర్కొన్న అంశాలు ఈ ఫారంలో ఉన్నాయి. కొత్త నిబంధనల ప్రకారం ఐటీఆర్ 1లో స్టాండర్డ్ డిడక్షన్ ఆప్షన్ ఉంది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ITR దాఖలు చేసేటప్పుడు గరిష్టంగా రూ.40,000 వరకు దాఖలు చేసుకోవచ్చు. సీనియర్ సిటిజన్లు రూ.50,000 వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. సేవింగ్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్స్, పోస్టాఫీస్ డిపాజిట్స్ పైన సేవ్ చేసుకోవచ్చు. వీటితో పాటు ఇతర మార్గాల ద్వారా ట్యాక్స్‌పేయర్స్‌కు ఆదాయం వస్తుందా అనే అంశం ఉంది. గత ఏడాది వరకు కేవలం ఫిగర్ మెన్షన్ చేసేలా ఫారం ఉంది. అలాగే, ఏ ట్యాక్స్ బెనిఫిట్ కింద ఎక్సెంప్షన్ అనే వివరాలు ఇవ్వాలి.

ఐటీఆర్ 2లో మీరు ఈ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది

ఐటీఆర్ 2లో మీరు ఈ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది

మీరు ఇండియాలో ఎన్ని రోజులు ఉన్నారనే వివరాలను పూర్తిగా ఐటీఆర్ 2లో ఇవ్వవలసి ఉంటుంది. రెసిడెన్షియల్ స్టేటస్ కూడా ఇవ్వాలి. మీరు రెసిడెంట్ ఎంచుకోవాలి. నాన్ రెసిడెన్షియల్ ట్యాక్స్ పేయర్ ఓవర్సీస్‌లోని రెసిడెన్సీ సమాచారం ఇవ్వాలి. దీంతో పాటు ఐడెంటిఫికేషన్ నెంబర్ ఇవ్వాలి. ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా (ఐసీఐ) లేదా పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (పీఐవో) రెసిడెన్షియల్ స్టేటస్‌ను నాన్ రెసిడెంట్‌గా ఎంచుకోవాలి. సంబంధిత ఆర్థిక సంవత్సరంలో ఎన్ని రోజులు ఎక్కడ ఉన్నానో తెలియజేయాలి. అలాగే గత నాలుగు ఫైనాన్షియల్ ఇయర్స్‌కు సంబంధించిన వివరాలు కూడా ఇవ్వాలి.

ఇమ్మూవబుల్ ప్రాపర్టీ విక్రయిస్తే

ఇమ్మూవబుల్ ప్రాపర్టీ విక్రయిస్తే

ఇక, మీరు ఇమ్మూవబుల్ ప్రాపర్టీని అమ్మితే కనుక పలు వివరాలు ఇవ్వవలసి ఉంటుంది. ఆ ప్రాపర్టీ కొనుగోలు చేసిన వ్యక్తి పేరు, పాన్‌కార్డు, ట్రాన్సాక్షన్ ప్రైస్, ప్రాపర్టీ ఉన్న చిరునామా వంటి వాటిని పేర్కొనాల్సి ఉంటుంది. ఒకరికంటే ఎక్కువ మంది కొనుగోలు చేస్తే అందరి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఓనర్‌షిప్ అండ్ అమౌంట్ వివరాలు వెల్లడించాలి.

 ట్యాక్స్ పేయర్స్ వివరాలివ్వాలి

ట్యాక్స్ పేయర్స్ వివరాలివ్వాలి

ట్యాక్స్ పేయర్స్ పన్ను రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు ఆదాయపన్ను శాఖకు అన్ని వివరాలను బహిర్గతం చేయాలి. ఇటీవలే సీబీడీటీ కొత్త ఐటీ రిటర్న్స్ ఫారంలను విడుదల చేసింది. గత ఆర్థిక సంవత్సర ఆదాయానికి సంబంధించి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే సమయంలో మొత్తం 7 ఫారాలను నింపాల్సి ఉంటుంది. పన్ను చెల్లింపుదారులు పన్ను ఎగవేయకుండా పారదర్శకంగా పన్ను చెల్లించేందుకు వీలుగా ఈ కొత్త ఫారాలను ఆదాయ పన్ను శాఖ నోటిఫై చేసింది. వ్యక్తిగత పన్ను కావొచ్చు, వ్యాపార పన్ను కావొచ్చు.. తమ ప్రొఫిసెనల్, రెసిడిన్షియల్ స్థితిని తెలిపే అన్ని ఆదాయ వివరాలను కొత్త ఫారాల్లో సమర్పించాల్సి ఉంటుంది. గత ఆర్థిక సంవత్సరానికి భిన్నంగా ఈ ఏడాది ఐటీఆర్ దాఖలు చేసేటప్పుడు ట్యాక్స్ పేయర్లు తమ ఆదాయ రాబడికి సంబంధించి ఎక్కువ సమాచారం ఇవ్వాలి. ప్రస్తుతం ఉంటున్న నివాసంలో ఎప్పటినుంచి ఉంటున్నారు, పన్ను జాబితాలో నమోదు కాని పేర్లు ఎన్ని ఉన్నాయో చెప్పాలి. TDSకు అవసరమైన పాన్‌కార్డు వివరాలను ఫారాల్లో ఇవ్వాల్సి ఉంటుంది. వ్యవసాయ ఆదాయం, కంపెనీల ఆదాయం, వ్యక్తిగత ఆదాయం, విదేశీ ఆస్తులు, బ్యాంకు అకౌంట్లు, షేర్ల ఆదాయం ఇలా అన్ని కంపెనీల ఆదాయాల వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+